యూనివర్సిటీ కాలేజ్ లండన్ ( University College London )(యూసీఎల్) భారతదేశంలోని 100 మంది ప్రతిభావంతులైన విద్యార్ధులు యూకేలో చదువుకోవడానికి వీలుగా కొత్త స్కాలర్‌షిప్ స్కీమ్‌ను ప్రకటించింది.అంతేకాదు.
ఇది దేశంలో ప్రీ యూనివర్సిటీ విద్యార్ధుల కోసం మొట్టమొదటి సమ్మర్ స్కూల్ కూడా.యూకేలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన యూసీఎల్ మంగళవారం ‘‘ India Excellence Scholarships’’ను ప్రకటించింది.తమ సంస్థలో ఫుల్ టైం మాస్టర్స్ డిగ్రీ అధ్యయనాలను కొనసాగించడానికి అత్యుత్తమ అకడమిక్ రికార్డు కలిగిన భారతీయ విద్యార్ధులకు మద్ధతు ఇస్తామని మంగళవారం తెలిపింది.2024-25 విద్యా సంవత్సరానికి ఫస్ట్ క్లాస్ డిగ్రీని కలిగిన లేదా అసాధారణ ట్రాక్ రికార్డ్ వున్న విద్యార్ధులకు 33 స్కాలర్‌షిప్‌లు అందుబాటులో వుంటాయి.వచ్చే రెండేళ్లలో మరో 67 స్కాలర్‌షిప్‌లు అందిస్తామని పేర్కొంది.
భారతీయ విద్యార్ధుల పట్ల కొనసాగుతున్న నిబద్ధతను , భారత్‌తో మా సంబంధాన్ని పటిష్టం చేసే కొత్త , విభిన్న అవకాశాలను అందించడానికి తాము సంతోషిస్తున్నామని యూసీఎల్ ప్రెసిడెంట్, ప్రోవోస్ట్ డాక్టర్ మైఖేల్ స్పెన్స్( Provost Dr.Michael Spence ) అన్నారు.యూసీఎల్ గ్లోబల్ కమ్యూనిటీలో భారతీయ విద్యార్ధులు కీలక సభ్యులని.
యూకేలో వారి జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పంచుకోవడానికి సహాయం చేయడానికి మరిన్ని వనరులు , మద్ధతును అందిస్తామని మైఖేల్ చెప్పారు.

యూసీఎల్ ఇండియా ఎక్స్‌లెన్స్ స్కాలర్‌షిప్ అనేది .ఇప్పటి వరకు అత్యంత విస్తృతమైన భారతీయ పథకంగా నిపుణులు చెబుతున్నారు.దీని ద్వారా ఏ విభాగంలోనైనా కాబోయే మాస్టర్స్ విద్యార్ధులు తమ అధ్యయనాల కోసం 5000 పౌండ్‌లను పొందవచ్చు.
యూసీఎల్ వంటి ప్రపంచస్థాయి సంస్థలో చదువుకోవడం ద్వారా వచ్చే విలువను భారతీయ విద్యార్ధులు గుర్తించినందుకు సంతోషంగా వుందన్నారు భారత్‌లోని బ్రిటన్ డిప్యూటీ హైకమీషనర్ క్రిస్టినా స్కాట్.వారి ఆలోచనలు భారత్, యూకే సంబంధాలను మరింత పెంచుతాయని ఆమె ఆకాంక్షించారు.

ఇకపోతే.యూసీఎల్ న్యూఢిల్లీలో వున్న బ్రిటీష్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక క్యాంపస్‌లో కొత్త సమ్మర్ స్కూల్ ప్రోగ్రామ్ కోసం ప్రణాళికలను వెల్లడించింది.ఇది ప్రీ యూనివర్సిటీ దశలో వున్న భారతీయ విద్యార్ధులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చదువుకోవడం ఎలా వుంటుందో రుచి చూపనుంది.యూసీఎల్ ఇండియా సమ్మర్ స్కూల్ .ఈ ఏడాది జూన్ 10-14న జరిగింది.10, 11 తరగతుల్లోని 50 మంది విద్యార్ధులకు క్లాసులు జరిగాయి.







