కూతురుని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి తాహతకు తగ్గ సంబంధం చూసి ఘనంగా వివాహం చేశారు ఓ తల్లిదండ్రులు.అయితే వివాహం తర్వాత కూతురిని భర్తతో పాటు అత్తమామలు తీవ్రంగా చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు.
ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో క్షణికావేశంలో కుమార్తె భర్తతో పాటు అత్తమామలను కత్తులతో పొడిచి చంపేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని( Andhra Pradesh ) పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.పల్నాడు జిల్లా( Palnadu District ) ముప్పాళ్ళ మండలం దమ్ములపాడు గ్రామానికి చెందిన మాధురి( Madhuri ) అనే యువతికు పిడుగురాళ్ల మండలం కోనంకికి చెందిన అనంతం నరేష్( Anantam Naresh ) అనే యువకుడికి ఐదేళ్ల క్రితం వివాహం అయింది.
పెళ్ళైన కొత్తలో వీరి కాపురం సాఫీగానే సాగింది.కానీ గత కొంతకాలంగా నరేష్ తన భార్య మాధురిని వేధించడం ప్రారంభించాడు.పైగా నరేష్ కు అతని తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయడంతో మాధురి తనను తన భర్తతో పాటు అత్తమామలు వేధిస్తున్నారని తన తల్లిదండ్రులకు తెలిపింది.

మాధురి తల్లిదండ్రులతో పాటు బంధువులంతా కలిసి కొనంకి లో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు.కానీ పంచాయితీ చర్చలు విఫలం కావడంతో ఇరు కుటుంబాల మధ్య మాట పెరిగి పెద్ద గొడవకు దారి తీసింది.దీంతో మాధురి తల్లిదండ్రులు( Madhuri Parents ) తీవ్ర ఆగ్రహానికి లోనై కుమార్తె భర్తపై, కుమార్తె అత్తమామలపై కత్తులతో దాడి చేశారు.

ఈ దాడిలో అనంతం నరేష్ (30), అతని తండ్రి అనంతం సాంబయ్య (56), తల్లి ఆదిలక్ష్మి (50) అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు.దీంతో గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







