ఈ మధ్య కాలంలో ప్రతి కుటుంబంలో అత్తాకోడళ్ల మధ్య గొడవలు సాధారణమయ్యాయి.అత్త చేసే పనులు కోడలికి నచ్చక కోడలు చేసే పనులు అత్తకు నచ్చక ఈ తరహా గొడవలు జరుగుతున్నాయి.
అయితే చెన్నైలో( Chennai ) మాత్రం అత్త ఐడియా కోడలి జీవితాన్ని మార్చేసింది.చనిపోయిన అత్త డైరీని చదివిన కోడలు వ్యాపారంలో( Business ) సక్సెస్ సాధించడంతో పాటు లక్షల్లో సంపాదిస్తుండటం గమనార్హం.
చెన్నైకు చెందిన సోనమ్( Sonam ) అజయ్( Ajay ) అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా సోనమ్ అత్త “ప్రేమలత” ను( Prema Latha ) సొంత కూతురిలా చూసుకునేవారు.ఎంతో ప్రేమగా చూసుకున్న అత్త మరణం సోనమ్ ను ఎంతగానో బాధ పెట్టింది.
అత్త మరణం తర్వాత సోనమ్ అత్తగదిని శుభ్రం చేసే సమయంలో ఒక డైరీ( Diary ) ఆమెకు కనిపించింది.ఆ డైరీ సోనమ్ జీవితాన్నే మార్చేసింది.సోనమ్ చేతికి దొరికిన డైరీలో ఎన్నో వంటలకు సంబంధించిన రెసిపీలు ఉన్నాయి.
ఈ రెసిపీలతో ఫుడ్ బిజినెస్ చేయాలనే ఆలోచన సోనమ్ కు రాగా ప్రేమ్ ఇటాసి( Prem Eatacy ) పేరుతో ఆమె బిజినెస్ ను మొదలుపెట్టారు.10 లక్షల రూపాయల పెట్టుబడితో సోనమ్ వ్యాపారాన్ని మొదలుపెట్టగా ఆమె బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.తన సక్సెస్ క్రెడిట్ అత్తగారికి చెందుతుందని సోనమ్ చెబుతున్నారు.
అత్త డైరీ లేకపోతే ఈ స్థాయిలో ఉండేదానిని కాదని సోనమ్ కామెంట్లు చేశారు.
నా సక్సెస్ క్రెడిట్ అంతా అత్తగారికి దక్కుతుందని సోనమ్ పేర్కొన్నారు.ప్రముఖ ఈకామర్స్ వెబ్ సైట్లలో సైతం ఈ సంస్థకు సంబంధించిన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.ఎలాంటి కెమికల్స్ లేకుండా సోనమ్ ఉత్పత్తులను తయారు చేస్తుండటం గమనార్హం.
సోనమ్ సక్సెస్ స్టొరీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.భవిష్యత్తులో సోనమ్ బిజినెస్ లో మరింత సక్సెస్ సాధించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.