Naveen Polishetty: పవన్ కళ్యాణ్ సినిమాలో నవీన్ పోలిశెట్టి నటించిన మీకు తెలుసా.. కానీ..!!

జాతి రత్నాలు ( Jathi Rathnaalu ) సినిమాతో ఇండస్ట్రీలో కామెడీ హీరోగా ఎదిగారు నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty ).ఈయన అంతకుముందే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నెగిటివ్ పాత్రలో అలాగే మహేష్ బాబు 1 నేనొక్కడినే,తాప్సి మెయిన్ లీడ్ చేసిన మిషన్ ఇంపాజిబుల్, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వంటి సినిమాల్లో చేశారు.

 Did You Know That Naveen Polishetty Acted In Pawan Kalyans Movie But-TeluguStop.com

అలాగే ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది మాత్రం జాతి రత్నాలు సినిమా.ఇక ఈ మధ్యకాలంలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ( Miss Shetty Mr.Polishetty ) అనే సినిమాతో నవీన్ పోలిశెట్టి స్టార్ హీరోయిన్ అనుష్కతో జత కట్టారు.ఈ సినిమా కూడా కలెక్షన్ల పరంగా మంచి వసూలు చేసింది.

ప్రస్తుతం కామెడీ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ప్రియదర్శి,నవీన్ పోలిశెట్టి వంటి వాళ్ళు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదిస్తున్నారు.అయితే నవీన్ పోలిశెట్టి పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) తో కూడా ఓ సినిమాలో నటించారట.

కానీ ఇప్పటివరకు ఆ విషయం ఎవరికీ తెలియదు.ఎందుకంటే ఆయన నటించిన సన్నివేశాలు లేవు కాబట్టి.మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ నటించిన ఏ సినిమాలో నవీన్ పోలిశెట్టి కూడా నటించారో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Nenokkadine, Saisrinivasa, Anushka Shetty, Jathi Rathnaalu, Katamarayudu,

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా ( Katamarayudu ) ఎన్నో అంచనాల మధ్య విడుదలై అట్టర్ ప్లాఫ్ అయిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాలో పాటలు ఆకట్టుకున్నప్పటికీ సినిమా మాత్రం ప్లాఫ్ అయింది.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి తమ్ముళ్లుగా కమల్ కామరాజు, అజయ్,చైతన్య, శివ బాలాజీ, ఆలీ లాంటివాళ్ళు నటించారు.

అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి తమ్ముడిగా ముందుగా నవీన్ పొలిశెట్టి నటించారట.

Telugu Nenokkadine, Saisrinivasa, Anushka Shetty, Jathi Rathnaalu, Katamarayudu,

ఈయనకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా తెరకెక్కించాక నవీన్ పోలిశెట్టి కి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చాయట.దాంతో అనారోగ్య సమస్యల వల్ల ఆ షూటింగ్ పూర్తి చేయలేకపోయారట.ఇక షూటింగ్ ఆలస్యం అవుతుంది అనే ఉద్దేశంతో నవీన్ పోలిశెట్టి ని ఆ సినిమా నుండి తీసేసి ఆయన ప్లేస్ లో శివబాలాజీ ( Shiva Balaji ) ని తీసుకున్నారట.

అలా నవీన్ పోలిశెట్టి పవన్ కళ్యాణ్ సినిమా నటించిప్పటికి ఆరోగ్య కారణాల వల్ల స్క్రీన్ మీద కనిపించలేకపోయారట.ఇక ఈ విషయం చాలామందికి తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube