Naveen Polishetty: పవన్ కళ్యాణ్ సినిమాలో నవీన్ పోలిశెట్టి నటించిన మీకు తెలుసా.. కానీ..!!
TeluguStop.com
జాతి రత్నాలు ( Jathi Rathnaalu ) సినిమాతో ఇండస్ట్రీలో కామెడీ హీరోగా ఎదిగారు నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty ).
ఈయన అంతకుముందే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నెగిటివ్ పాత్రలో అలాగే మహేష్ బాబు 1 నేనొక్కడినే,తాప్సి మెయిన్ లీడ్ చేసిన మిషన్ ఇంపాజిబుల్, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వంటి సినిమాల్లో చేశారు.
అలాగే ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది మాత్రం జాతి రత్నాలు సినిమా.ఇక ఈ మధ్యకాలంలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ( Miss Shetty Mr.
Polishetty ) అనే సినిమాతో నవీన్ పోలిశెట్టి స్టార్ హీరోయిన్ అనుష్కతో జత కట్టారు.
ఈ సినిమా కూడా కలెక్షన్ల పరంగా మంచి వసూలు చేసింది.ప్రస్తుతం కామెడీ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ప్రియదర్శి,నవీన్ పోలిశెట్టి వంటి వాళ్ళు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదిస్తున్నారు.
అయితే నవీన్ పోలిశెట్టి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) తో కూడా ఓ సినిమాలో నటించారట.
కానీ ఇప్పటివరకు ఆ విషయం ఎవరికీ తెలియదు.ఎందుకంటే ఆయన నటించిన సన్నివేశాలు లేవు కాబట్టి.
మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ నటించిన ఏ సినిమాలో నవీన్ పోలిశెట్టి కూడా నటించారో ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా ( Katamarayudu ) ఎన్నో అంచనాల మధ్య విడుదలై అట్టర్ ప్లాఫ్ అయిన సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమాలో పాటలు ఆకట్టుకున్నప్పటికీ సినిమా మాత్రం ప్లాఫ్ అయింది.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి తమ్ముళ్లుగా కమల్ కామరాజు, అజయ్,చైతన్య, శివ బాలాజీ, ఆలీ లాంటివాళ్ళు నటించారు.
అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి తమ్ముడిగా ముందుగా నవీన్ పొలిశెట్టి నటించారట.
"""/" /
ఈయనకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా తెరకెక్కించాక నవీన్ పోలిశెట్టి కి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చాయట.
దాంతో అనారోగ్య సమస్యల వల్ల ఆ షూటింగ్ పూర్తి చేయలేకపోయారట.ఇక షూటింగ్ ఆలస్యం అవుతుంది అనే ఉద్దేశంతో నవీన్ పోలిశెట్టి ని ఆ సినిమా నుండి తీసేసి ఆయన ప్లేస్ లో శివబాలాజీ ( Shiva Balaji ) ని తీసుకున్నారట.
అలా నవీన్ పోలిశెట్టి పవన్ కళ్యాణ్ సినిమా నటించిప్పటికి ఆరోగ్య కారణాల వల్ల స్క్రీన్ మీద కనిపించలేకపోయారట.
ఇక ఈ విషయం చాలామందికి తెలియదు.
గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేయబోయి సింహాల చేతిలో హతమైన జూకీపర్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!