Mammootty : 70 ఏళ్ళ వయసులో మమ్ముట్టి నిజంగానే అదరగొట్టాడుగా ?

సినిమా అంటే ఫ్యాషన్ ఉండటం మాత్రమే కాదు కష్టపడటం కూడా ఒక సవాల్.వయసులో ఉన్న హీరోలు తమ శరీరాన్ని ఎలాగైనా కష్టపెట్టి కష్టమైనా ఫీట్స్ చేస్తూ సినిమా నే ప్రాణంగా అన్ని రకాల పనులు చేస్తూ ఉంటారు.

 Mammootty New Movie Kannur Squad Is Really Good-TeluguStop.com

కానీ ఒక 70 ఏళ్ళ వ్యక్తి 20 ఏళ్ళ హీరో చేసినట్టు యాక్షన్ సీన్స్, యాక్టింగ్ చేయడం అనేది ఫ్యాషన్ ని మించిన పదం ఏదైనా ఉంటె దానితో జోడించి చెప్పాలి.సాధారణంగా 70 ఏళ్ళ వ్యక్తి అంటే వృద్ధుడు అవుతాడు.

మన పక్కన వ్యక్తులు అయితే పెన్షన్ తీసుకుంటూ ఉంటారు.కానీ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి( Malayalam megastar Mammootty ) కి అలాంటి అవకాశం లేదు.

అయన రిటైర్మెంట్ గురించి అస్సలు ఏ రకంగానూ ఆలోచించడం లేదు.పైగా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరస యాక్షన్ సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.

Telugu Hot, Kannur Squad, Mammootty-Telugu Top Posts

ఇక ఇప్పుడు ఈయన గురించి మాట్లాడుకోవడానికి ముఖ్యమైన కారణం ఆయన ఇటీవల నటించిన కన్నూర్ స్క్వాడ్ ( Kannur Squad )సినిమానే.ఈ సినిమా పోలీస్ వ్యవస్థ గురించి రాష్ట్ర శాంతి భద్రతల గురించి.అందుకోసం లా అండ్ ఆర్డర్ ని కాపాడే పని ఏవిధంగా ఒక పోలీస్ అనుభవిస్తాడు అనే విషయాలను చాల చక్కగా చెప్పారు.ఈ మూవీ తెలుగు లో హాట్ స్టార్( Hot star ) లో చూడచ్చు.

ఒక కేసు గురించి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పోలీస్ లపై ఎలాంటి ప్రెజర్ ఉంటుందో ఎంతో చక్కడ చూపించడం లో దర్శకుడు సక్సెస్ అయ్యారు.పైగా సినిమా అంటే హీరో మాత్రమే కాదు నెగటివ్ లక్షణాలు ఉన్న పాత్రలు కుండా ఉండాలి.

కానీ ఈ సినిమాలో ఎవరు కూడా చెడ్డవారు కాదు.ఏ పాత్రను కూడా నెగటివ్ గా చూపించకుండా సినిమా మలిచిన తీరు అద్భుతం.

Telugu Hot, Kannur Squad, Mammootty-Telugu Top Posts

సినిమాను మమ్ముట్టి తన నటనతో మరొక లెవల్ కి తీసుకెళ్లాడు.యాక్షన్ సీన్స్ అన్ని కూడా మంచి డ్రామా తో కూడుకొని ఉండటం వల్ల చాలా నాచురల్ గా కనిపించాయి.కాస్త అక్కడక్కడా ల్యాగ్ అనిపించినా సినిమా ఓవర్ ఆల్ గా చాల బాగుంది.ఇక ఇదే తరహా కార్తీ హీరో గా నటించిన ఖాకీ సినిమా కూడా ఉంటుంది.

కానీ ఆ సినిమాకు ఈ సినిమాకు ఉన్న ముఖ్యమైన తేడా పాత్రల మధ్య నడిచిన డ్రామా.ఒక ఒక కొలిక్కి రాని కేసుల విషయముల పోలీసుల కష్టం ఎంత ఘోరంగా ఉంటుందో ఈ సినిమా లో చూడచ్చు.

ఇక సినిమా కోసం ఎలాంటి లవ్ ట్రాక్ పెట్టకపోవడం నిజంగా మెచ్చుకోవాలి.కథను మాత్రమే నమ్ముకొని సినిమా తీస్తే అది కన్నూర్ స్క్వాడ్ లాగ ఉంటుంది.ఈ సినిమాకు దర్శత్వం వహించింది.రాబి వర్గేసే రాజ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube