తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.రేవంత్ రెడ్డి పెద్ద భూ కబ్జాదారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్ నేతలే అంటున్నారని కేసీఆర్ తెలిపారు.అంతేకాకుండా గతంలో ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు.
జైల్లో చిప్పకూడు తిన్నా రేవంత్ రెడ్డికి సిగ్గు రాలేదని మండిపడ్డారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ గెలిచేది లేదన్న ఆయన రేవంత్ రెడ్డి సీఎం అయ్యేది లేదని తెలిపారు.
రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే గబ్బు అని ఎద్దేవా చేశారు.కొడంగల్, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని తెలిపారు.
రేవంత్ రెడ్డికి నీతి లేదు, పద్ధతి, నియమం లేదని మండిపడ్డారు.ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మాటలు విని మోసపోవద్దని తెలిపారు.







