తెలంగాణలో బీజేపీ అగ్రనేతల ప్రచారపర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ వంటి ప్రముఖులు విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు.ఈనెల 25, 26, 27న తెలంగాణలో మోదీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
ఈ మేరకు ఆరు సభల్లో మోదీ పాల్గొననున్నారు.ఈనెల 25న మహేశ్వరం, కామారెడ్డిలో జరిగే బీజేపీ సభలకు మోదీ హాజరుకానున్నారు.
అలాగే 26న తూఫ్రాన్, నిర్మల్ సభలకు హాజరుకానున్న మోదీ 27న మహబూబాబాద్, కరీంనగర్ లో సభల్లో పాల్గొననున్నారు.అలాగే 27వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు రోడ్ షో నిర్వహించాలని బీజేపీ యోచిస్తోంది.







