ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ మేరకు నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణలో ప్రజల సొమ్మును కొందరు దోచుకుంటున్నారని ఆరోపించారు.కేసీఆర్ ను శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాలన్నారు.
కాంగ్రెస్ వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు.నాణ్యమైన సన్నబియ్యం ఇస్తామన్న పొంగులేటి తనను, రేవంత్ రెడ్డిని ఓడించేందుకు కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలో తెలంగాణలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమేనని స్పష్టం చేశారు.







