ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం( Govt Job ) రావాలంటే తప్పనిసరిగా కోచింగ్ తీసుకోవాల్సిందే.కోచింగ్ లేకుండా పోటీ పరీక్షలు రాస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి.
అయితే వెంకట సాయితేజ( Venkata Saiteja ) మాత్రం ఎలాంటి కోచింగ్ లేకుండా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ప్రశంసలు అందుకోవడంతో పాటు సరైన ప్రణాళికతో ముందడుగులు వేస్తే కోచింగ్ లేకుండా కూడా సక్సెస్ సాధించవచ్చని ప్రూవ్ చేశారు.
పట్టుదల, ఆత్మవిశ్వాసంతో సక్సెస్ సాధించిన వెంకట సాయితేజ ఉన్నతమైన లక్ష్యం ఉంటే ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించవచ్చని చెబుతున్నారు.
హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ కు చెందిన దంటు వెంకట సాయితేజ( Dantu Venkata Saiteja ) తాను హైదరాబాద్ లోనే పుట్టి పెరిగానని నాన్న ప్రైవేట్ సంస్థలో పని చేసి రిటైర్ అయ్యారని తెలిపారు.అమ్మ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
బీటెక్ పూర్తైన వెంటనే పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ మొదలుపెట్టానని 2014లో ఐబీపీఎస్-4 ఉద్యోగం( IBPS-4 ) సాధించానని అన్నారు.ఆ తర్వాత ఎఫ్.సీ.ఐ గ్రేడ్3 హెచ్.ఆర్ అసోసియేట్ జాబ్ కోసం ప్రయత్నించి ఆ జాబ్ కూడా సాధించానని సాయితేజ అన్నారు.2018 సంవత్సరంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్,( SSC ) గ్రూప్-4 పరీక్షలలో( Group-4 ) మంచి మార్కులు వచ్చి జాబ్స్ వచ్చాయని అన్నారు.
గ్రూప్4 జాబ్ లో మొదట జాయిన్ అయ్యానని ఆయన తెలిపారు.ఆ తర్వాత్ సీజీడీఏ అడిటర్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యానని ఆ పరీక్షలో కస్టమ్స్ ఎగ్జామినర్ జాబ్ వచ్చిందని తెలిపారు.ఒక పబ్లికేషన్ కు చెందినా మెటీరియల్ ను చదవడం మంచిదని ఆయన అన్నారు.మాక్ టెస్ట్ లు రాయడం వల్ల సబ్జెక్ట్ లు ఇంప్రూవ్ అవుతాయని వెంకట సాయితేజ కామెంట్లు చేశారు.
సాయితేజ చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.