తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) లో రేవంత్ రెడ్డి హవా అన్నట్లుగా పరిస్థితి ఉంది .తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తున్నారు.
అలాగే కొడంగల్ నియోజకవర్గం నుంచి రెండు చోట్ల పోటీ చేస్తున్నారు.దీంతో ఈ రెండు నియోజకవర్గల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను ఎన్నికల ప్రచారం నిర్వహించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా హెలికాప్టర్ కేటాయించడంతో, రోజుకు నాలుగు, ఐదు నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తున్నారు.తెలంగాణ కాంగ్రెస్ లో స్టార్ క్యాంపైనర్లు చాలామంది ఉన్నా వారంతా తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు.
ఈ విషయంలో అధిష్టానం ఎన్ని వార్నింగ్ లు ఇచ్చినా పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్నారు.కానీ రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని జనాలను కోరుతూనే బీఆర్ఎస్ , బిజెపి( BRS BJP ) లపై విమర్శలతో విరుచుకు పడుతున్నారు.

అంతేకాకుండా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ ( Congress )లో చేరుతున్న వారితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.కాంగ్రెస్ తరపున మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు.తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు చాలామంది ఉన్నా, రేవంత్ రెడ్డి మాత్రమే పూర్తిగా యాక్టివ్ గా ఉంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు హోదాలో తన పదవికి న్యాయం చేస్తున్నారు.ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ, ఆ స్థాయి వ్యక్తిగా ప్రజల్లోనూ, కాంగ్రెస్ నేతల్లోనూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు తమ నియోజకవర్గంతో పాటు, పక్క నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు కూడా తీరిక లేనట్టుగా వ్యవహరిస్తుండగా, రేవంత్ మాత్రం తాను పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు .ఇక ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తే, అక్కడకు హాజరవుతూ పార్టీ తరఫున భారీ బహిరంగ సభలు నిర్వహించే బాధ్యతలను ఆయనే చూస్తున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఒక్కరే అన్నట్లుగా పరిస్థితి మారింది.

పదవుల విషయంలో తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని, ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తామే ముఖ్యమంత్రి అవుతామని పోటా పోటీగా మిగతా కాంగ్రెస్ నాయకులు ప్రకటనలు చేస్తున్నా, మిగతా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు మాత్రం సీనియర్లు ఆసక్తి మాత్రం చూపించడం లేదు. దీంతో రేవంత్ హవా అటు పార్టీలోనూ, ఇటు ప్రజలలోను పెరిగినట్టుగానే కనిపిస్తుంది.







