క్యాంపెనింగ్ లో జోరు పెంచిన కమలదళం!

నిన్న మొన్నటి వరకు కాస్త స్తబ్ధుగా కనిపించిన తెలంగాణ బిజెపి( Telangana BJP ) జోరుపెంచింది వరుసపెట్టి అగ్రనేతల పర్యటనలతో తెలంగాణ ఎన్నికల్లో ప్రచారాన్ని హూరెత్తిస్తుంది.మాజీ ముఖ్య మంత్రులు మొదలుకుని , మంత్రులు , హోమంత్రి ,ఆర్థిక మంత్రి, ప్రధాన మంత్రితో సహా తెలంగాణకు క్యూ కడుతున్నారు .

 Bjp Started Aggressive Campaign In Telangana Details, Bjp , Bjp Elections Campai-TeluguStop.com

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి దీపక్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్( Nirmala Sitaraman ) కేసీఆర్ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోశారు.మోటార్లకు మీటర్లు పెట్టమన్నామన్నది అబద్ధమని, నిధులు నిలిపేసారన్న వార్తలపై ఆమె ఘాటుగా రియాక్ట్ అయ్యారు .నిబంధనలు ప్రకారమే నిధులు ఇచ్చామని, నిబంధనలు పాటించకపోతే అదనపు నిధులు ఎలా ఇస్తామంటూ ఆమె ప్రశ్నించారు .కేసీఆర్ను జాతీయ నేతగా ఎవరూ గుర్తించడం లేదని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Amit Shah, Bjp Bc Cm, Bjp, Kishan Reddy, Modi, Telangana, Telangana Bjp-T

మరోవైపు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి లక్ష్మణ్ లతో పాటు ముషీరాబాద్ లో ప్రచారం చేస్తున్నారు .అవినీతి లో భారతీయ రాష్ట్ర సమితికి ( BRS ) మెడల్ ఇవ్వాలని వ్యాఖ్యలు చేశారు ఫడ్నవీస్.( Fadnavis ) మహారాష్ట్రలో కూడా బి ఆర్ఎస్ దుకాణం బంద్ అయింది అన్నారాయన .మరో పక్క హోమ్ మంత్రి అమిత్ షా( Amit Shah ) వరుసపెట్టి బహిరంగ సభలకు హాజరవుతున్నారు.ఇంకోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ( PM Modi ) కరీంనగర్ పర్యటనకు కూడా రంగం సిద్ధమైంది.ప్రధానమంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్ కు విచ్చేస్తున్న మోడీకి భారీ ఎత్తున స్వాగతం పలకాలని భాజపా శ్రేణులకు ఇప్పటికే బండి సంజయ్ అల్టిమేటం జారీ చేశారు.

కరీంనగర్ ప్రధాన మోడీ కోసం ఎదురు చూస్తుందని చెప్తున్న బండి భారీ ఎత్తున సభను విజయవంతం చేయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Telugu Amit Shah, Bjp Bc Cm, Bjp, Kishan Reddy, Modi, Telangana, Telangana Bjp-T

భాజపా ప్రకటించిన బీసీ సీఎం( BC CM ) హామీ వర్కౌట్ అవుతుందన్న భావన కమలదలంలో ఉన్నట్లుగా తెలుస్తుంది.కచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే కింగ్ మేకర్ అవ్వడానికి అవకాశం ఉందని భావిస్తున్న బీజేపీ ఇప్పుడు వరుస పెట్టి అగ్రస్థాయి నాయకులు దింపడంతో పరిస్థితులు భాజపాకు కొంత అనుకూలంగా మారుతున్న వాతావరణం అయితే ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.మరోవైపు 21 మంది కాంగ్రెస్ నేతలకు బి ఆర్ఎస్ ఎన్నికల్లో డబ్బులు సహాయం స్తున్నట్లుగా తమకు సమాచారం ఉందన్నారు బిజెపి జాతీయ నేత మురళీధర్ రావు ఇలా కాంగ్రెస్, బి ఆర్ఎస్ లపై ముప్పేట దాడి చేస్తున్న భాజపా అగ్రనేతలు తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube