ఛలో మరియు గీత గోవిందం సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ రష్మిక మందన్నా( Rashmika Mandanna ) ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారింది.చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, సినిమా సినిమా కు ఈ అమ్మడి యొక్క క్రేజ్ అమాంతం పెరుగుతూ వస్తూ ఉంది.
తాజాగా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటో షూట్స్ వైరల్ చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది.సౌత్ లో ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది.
ఇక హిందీలో కూడా ఈమె నటించిన సినిమాలు విడుదల అయ్యాయి.అయితే ఇప్పటి వరకు వచ్చిన హిందీ సినిమా ల్లో రష్మిక కి అక్కడ మంచి గుర్తింపు రాలేదు.
కానీ ఇప్పుడు రణబీర్ కపూర్ తో( Ranbir Kapoor ) చేసిన యానిమల్ తో( Animal Movie ) మాత్రం హిందీ బాక్సాఫీస్ వద్ద ఆమెకు మంచి ఫలితాన్ని తెచ్చి పెట్టడం మాత్రమే కాకుండా బాలీవుడ్ లో( Bollywood ) బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ మధ్య కాలంలో ఆమె హిందీ సినిమాల్లో ఎక్కువగా నటించాలని సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చిందట.అందుకే యానిమల్ సినిమా కనుక హిట్ అయితే వరుసగా అక్కడ ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అదే నిజం అయితే కచ్చితంగా రష్మిక మందన్నా బాలీవుడ్ కే పూర్తిగా పరిమితం అయ్యే అవకాశాలు లేకపోలేదు.కనుక టాలీవుడ్ తో పాటు ఇతర సౌత్ సినిమాలకు ఆమె మొహం చాటేస్తుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మొత్తానికి బాలీవుడ్ లో రష్మిక నటించిన యానిమల్ సినిమా ఫలితం పై అందరి దృష్టి ఉంది.
సందీప్ వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమాను వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఇక తెలుగు లో ప్రస్తుతం పుష్ప 2 లో ( Pushpa 2 ) నటిస్తోంది.
అంతే కాకుండా మరో రెండు మూడు సినిమా లు కూడా చేస్తోంది.