దొరల పాలన కు చరమ గీతం పాడుదం బిజెపి అభ్యర్థి బొడిగే శోభ ( BJP candidate Bodige Shobha )రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం లో నీ తడగొండ అనంత పల్లి ఘోరం బూరుగుపల్లి గుండెన పెళ్లి బోయిన్పల్లి,దేశాయిపల్లి లో బిజెపి అభ్యర్థి బోడిగే శోభ ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు.ప్రచారానికి వచ్చిన శోభ కు మహిళలు గణ స్వాగతం పలికి మద్దతు తెలిపారు.
ఈ సందర్బంగా శోభక్క మాట్లాడుతూ గత కాలం లో తాను చేసిన అభివృద్ధి నీ చూసి ఓటు వేయాలని కోరారు.మండలం లో బి అర్ ఎస్ ,కాంగ్రెస్ ( BRS, Congress ) అభివృద్ధి శూన్యం అన్నారు .నేను ఏం ఎల్ ఏ గా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ కార్యక్రమాలు చేస్తూ గ్రామాల అభివృద్ధి కి సహకరించాను అని అన్నారు.కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయి అన్నారు.
రాష్ట్రంలో అవినీతి తరస్థాయి కి చేరింది అన్నారు.కుటుంబ పాలనా పోవాలంటే బీజేపీ కి మద్దతు ఇచ్చి భారీ మెజారిటీ తో గెలిపించాలని అన్నారు.మీలో ఒకరిగా ఉంటూ మీ కష్ట సుఖాల్లో పలుపంచుకుంటా అన్నారు.2014 లో డబుల్ బెడ్ రూమ్ లు అందజేస్తామని చెప్పి ఒక్కటి కూడా ఇవ్వలేదని అన్నారు.పేదవారి సమస్యలను ఇక్కడి బి ఆర్ ఎస్ ఎల్ ఏ ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు.బీజేపీ మేనిఫెస్టో వచ్చాక ప్రజలంతా సంతోషంగా ఉన్నారు.ఈ సారి బీజేపీ అభ్యర్థులని గెలిపిస్తామనే నమ్మకం ప్రజల్లో కల్గింది అన్నారు.10సంవత్సరాల పాలనా లో నిరుద్యోగ సమస్యలు పట్టించుకోలేదని అన్నారు.బీజేపీ ప్రభుత్వం గల్లీ నుంచి ఢిల్లీ వరకు జెండా ఎగరేస్తుంది అన్నారు .ఆమె వెంట బిజెపి మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి తో పాటు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.