విభజన చట్టం అంశాలపై కేంద్ర హోంశాఖ సమీక్ష నిర్వహించింది.ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో ఏపీ విభజన చట్టం అమలుపై సమావేశం జరుగుతోంది.
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.పోలవరం, ప్రత్యేక హోదా, విద్యాసంస్థల ఏర్పాటు, మౌలిక వసతుల ప్రాజెక్టులతో పాటు 13వ షెడ్యూల్ లోని ఆస్తుల విభజన తదితర అంశాలపై చర్చించనున్నారు.
ఈ క్రమంలో కేంద్రం నిర్వహించే సమావేశంలో ఏఏ అంశాలపై చర్చించాలనే దానిపై సీఎం జగన్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే.