తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి చాలా సంవత్సరాల పాటు మెగాస్టార్ గా వెలుగొందిన విషయం మనకు తెలిసిందే… ఇక ఈయన నటించిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించడం కాకుండా ఇండస్ట్రీ రికార్డులను కూడా తిరగరాశాయి.అయితే ఈ మధ్య అల్లు అరవింద్( Allu Arvind ) కి, చిరంజీవికి మధ్య అసలు పడడం లేదు అనే విషయం మీద చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.

ఇక ఇప్పుడు అల్లు అరవింద్ చేస్తున్న చేష్టలు చూస్తుంటే చిరంజీవికి ఎవరైతే అగేనిస్ట్ గా ఉంటారో వాళ్ళందరితో అల్లు అరవింద్ కలిసి తిరుగుతున్నట్టు గా తెలుస్తుంది… ఇక ఈ విషయాన్ని చూసిన అభిమానులందరికీ కూడా అల్లు అరవింద్ చిరంజీవికి ఆగనిస్ట్ గా ఎందుకు చేస్తున్నాడు అంటూ వాపోతున్నారు… అందులో భాగంగానే బాలకృష్ణ తో అన్ స్టాపబుల్ షో ( Unstoppable )చేయిస్తున్నాడు అంటూ పలు రకాల వార్తలు కూడా వస్తున్నాయి నిజానికి బాలయ్య కి చిరంజీవి కి ఎలాంటి గొడవలు లేవు కానీ సినిమాల పరంగా పాటు ఉండటం తో అల్లు అరవింద్ అలా చేస్తున్నట్టు గా తెలుస్తుంది…

ఇక ప్రస్తుతం మోహన్ బాబు( Mohan Babu )తో కూడా బిజినెస్ కు సంబంధించిన పనులను చేసే ప్రయత్నం చేస్తున్నాడు.అలాగే ఇక చిరంజీవి అంటే కొంతమంది గిట్టని వాళ్ళతో సహా అందరితో మంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు…అలాగే అల్లు అరవింద్ చిరంజీవి గురించి కూడా చాలా మంది దగ్గర బ్యాడ్ గా మాట్లాడుతున్నట్టు గా తెలుస్తుంది ఇక చిరంజీవి మాత్రం ఇది పట్టించుకోవట్లేదు… ఇక అరవింద్ ఇదంతా దేనికోసం చేస్తున్నాడు అనే దానిపట్ల చిరంజీవి అభిమానులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు… మరి ఈ విషయం మీద చిరంజీవిగాని మిగతా వాళ్ళు గానీ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి…








