నల్లగొండ జిల్లా: ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎలాంటి అభివృద్ది పనులు చెయ్యొద్దని నిబంధనలకు ఉన్నా నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం పాములపాడు గ్రామంలో అవేవీ పట్టవన్నట్లు రోడ్డు మరమ్మతులు చేస్తున్నా ఎన్నికల అధికారులు ఆ వంక చూడకపోవడం విస్మయం కలిగిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఇంత కాలం గుర్తుకు రాని రోడ్డు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందని,కేవలం అధికార పార్టీ ఓట్ల కోసమే ఈ కార్యక్రమానికి మండల ప్రజాప్రతినిధులు,సర్పంచ్, ఎంపిటిసి కీలకంగా వ్యవహరిస్తున్నా,
ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తవ్వుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, ఇదేంటని స్థానికులు అడిగేందుకు ప్రయత్నం చేస్తే అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు భయపడి ముందుకు రావడం లేదని తెలుస్తుంది.
ఇదే విషయమై మీడియా మండల అధికారులకు ఫోన్ చేయగా పొంతనలేని సమాధానం ఇవ్వడం గమనార్హం.ఇన్ని రోజుల నుంచి వెయ్యని రోడ్లు ఇప్పుడు వేయడం కరెక్ట్ కాదని,దీనికి ఎలక్షన్ కోడ్ వర్తించదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.