బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ పై మంత్రి గంగుల కమలాకర్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అవినీతికి పాల్పడినందుకే బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తొలగించారని ఆరోపణలు చేశారు.
ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని బండి సంజయ్ డబ్బులు దండుకున్నారని మంత్రి గంగుల అన్నారు.దీనిపై పార్టీ నేతలు మోదీ, అమిత్ షాకు ఫిర్యాదు కూడా చేశారని తెలిపారు.
అదేవిధంగా బండి సంజయ్ పాల్పడిన అవినీతికి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయన్న మంత్రి గంగుల కమలాకర్ త్వరలోనే బయటపెడతానని స్పష్టం చేశారు.







