దాదాపుగా 20 సంవత్సరాల క్రితం వరకు చిరంజీవి, బాలయ్య, వెంకటేశ్, నాగార్జున మధ్య గట్టి పోటీ ఉండేది.ఈ హీరోల సినిమాలకు అప్పట్లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చేవి.
అయితే కొత్త హీరోల ఎంట్రీతో ఈ హీరోల సినిమాలకు గతంతో పోలిస్తే క్రేజ్ తగ్గింది.అయితే హిట్ టాక్ వస్తే మాత్రం ఈ హీరోల సినిమాలు సైతం బాగానే కలెక్షన్లు సాధిస్తున్నాయి.
సీనియర్ హీరోలు( Senior Heroes ) తమ సినిమాలను ఎక్కువగా పండుగల సమయంలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.చిరంజీవి, బాలయ్య, వెంకటేశ్, నాగార్జునలలో ఎవరు నంబర్ వన్ అనే ప్రశ్నకు కొంతమంది చిరంజీవి పేరు సమాధానంగా చెబితే మరి కొందరు బాలయ్య పేరు సమాధానంగా చెబుతున్నారు.

చిరంజీవి( Chiranjeevi ) రీఎంట్రీలో నటించిన సినిమాలలో ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య సినిమాలు భారీ రేంజ్ లో కలెక్షన్లను సాధించాయి.బడ్జెట్ తో పోల్చి చూస్తే ఈ సినిమాలు కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించాయి.అయితే వరుసగా హిట్లు సాధించే విషయంలో చిరంజీవి తడబడుతున్నారు.మరోవైపు బాలయ్య( Balakrishna ) వరుసగా విజయాలు అందుకుంటున్నా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించాలన్న కల మాత్రం నెరవేరవడం లేదు.
సీనియర్ హీరోల్లో నంబర్ వన్ ఎవరనే ప్రశ్నకు ప్రస్తుతం ఇద్దరు హీరోల పేర్లు సమాధానంగా చెప్పాల్సి వస్తోంది.చిరంజీవి తర్వాత సినిమాలు సక్సెస్ సాధిస్తే చిరు నంబర్1 గా చిరు సినిమాల కలెక్షన్లను దాటితే బాలయ్య నంబర్ 1 గా నిలిచే ఛాన్స్ ఉంది.

నాగార్జున, వెంకటేశ్( Venkatesh ) లకు భారీ స్థాయిలో క్రేజ్ ఉన్నా ఈ హీరోల సినిమాలు సంచలనాలు సృష్టించే విషయంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాయి.సీనియర్ హీరోల భవిష్యత్తు సినిమాలు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.







