తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇవాళ తెలంగాణకు రానున్నారు.
ఈ మేరకు ఆసిఫాబాద్, ఖానాపూర్ లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.ఈ క్రమంలో మధ్యాహ్నం నాగోబా ఆలయంలో ప్రియాంక గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారాన్ని చేపట్టనున్నారు.కాగా ఇప్పటికే రాహుల్ గాంధీ పలు నియోజకవర్గాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.







