తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సింగర్ సునీత( Sunitha ) ఒకరు.17 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సింగర్ గాను( Singer ) ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.అలాగే ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరి హీరోయిన్లకి కూడా ఆల్మోస్ట్ ఈమె డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్(Dubbing Artist) గా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె ప్రస్తుత కాలంలో పిల్లల మనస్తత్వం అలాగే ప్రేమలు బ్రేకప్ గురించి ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ఇటీవల కాలంలో చాలా మంది ఎంతో తొందరగా ప్రేమలో పడుతున్నారు.అంతే తొందరగా బ్రేకప్ చెప్పుకుంటున్నారని తెలిపారు.ప్రస్తుత కాలంలోని పిల్లలు లవ్ లైఫ్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నారని ఈమె పేర్కొన్నారు.శారీరక మానసిక ఇబ్బందులతో మాత్రమే కాకుండా ప్రతి చిన్న విషయానికి బ్రేకప్ చెప్పుకోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని సునీత వెల్లడించారు.
అయితే బ్రేకప్ చెప్పుకున్న కూడా పార్టీలు ఇవ్వడం మరో కొత్త లవర్ దొరికితే కూడా పార్టీలు ఇవ్వడం జరుగుతుందని ఈమె వెల్లడించారు.

చాలామంది ఒక అమ్మాయి వేసుకున్నటువంటి డ్రెస్ బట్టి తన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంటారు.ఇలా వేసుకున్న డ్రెస్ బట్టి వారిని వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం పూర్తిగా తప్పు అంటూ ఈమె వెల్లడించారు.ఏది ఏమైనా సునీత ఇలా బ్రేకప్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అయితే ఈమె కూడా మొదట వివాహం చేసుకొని మనస్పర్ధలు కారణంగా తన భర్తకు విడాకులు ఇచ్చి 2021 వ సంవత్సరంలో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని(Ram Veerapaneni) అనే వ్యక్తిని రెండవ పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.







