టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ( TPCC Chief Revanth Reddy )కాంగ్రెస్ విజయంపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారా ? గత ఎన్నికల్లో ఓటమిపాలు అయినప్పటికి ఈసారి కేసిఆర్( KCR ) నే ఓడించేంతా బలం పెంచుకున్నారా ? అంటే అవుననే అతున్నారాయన.గత ఎన్నికల్లో కోడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి.
బిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు, అయితే గతంతో పోల్చితే ప్రస్తుతం తన పరిధిని అమాంతంగా పెంచుకున్నారు రేవంత్ రెడ్డి.అందుకే కోడంగల్ లో విజయం తథ్యం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే కోడంగల్ తో పాటు కేసిఆర్ కు పోటీగా కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి.
కామారెడ్డిలో( Kamareddy ) కేసిఆర్ ను ఓడించడం గ్యారెంటీ అని చెబుతున్నారు.ఇకపోతే ఓవరాల్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే మొన్నటివరకు అంతర్గత కుమ్ములాటలతో సతమతమైన హస్తంపార్టీ ప్రస్తుతం ఎలక్షన్ రేస్ లో యమ దూకుడుగా వ్యవహరిస్తోంది.
ముఖ్యంగా కర్నాటక ఎన్నికల్లో విజయం తరువాత టి కాంగ్రెస్( T Congress ) లో జోష్ పెరిగింది.అంతకుముందు సొంత పార్టీలోనే విభేదాలతో ఎడమొఖం పెడమొఖంగా ఉంటూ వచ్చిన సీనియర్స్ మరియు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒకే తాటిపై నిలిచే ప్రయత్నం చేస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో బిఆర్ఎస్ పై మరియు కేసిఆర్ పాలనపై చేస్తున్న విమర్శలు, వ్యంగ్యస్త్రాలు, ఆరోపణలు వేగంగా ప్రజల్లోకి వెలుతున్న వేళ కాంగ్రెస్ కు ఊహించిన దానికంటే ఎక్కువే మైలేజ్ వస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.దానికితోడు ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై సర్వేలు కూడా సానుకూలంగా వస్తుండడంతో రేవంత్ రెడ్డితో పాటు హస్తం నేతలంతా కూడా తమదే అధికారం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు.మరి ఎన్నికల్లో విజయంపై హస్తం నేతలది కాన్ఫిడెన్సా ? ఓవర్ కాన్ఫిడెన్సా అనేది మరి కొద్ది రోజుల్లో తేలిపోనుంది.