ప్రభాస్ ( Prabhas ) హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neel ) కాంబోలో రూపొందిన సలార్( Salaar ) సినిమా ను వచ్చే నెలలో విడుదల చేయబోతున్నారు.క్రిస్మస్ సందర్భంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను ఒకటి రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ మద్య కాలంలో సలార్ గురించి కొంత నెగటివ్ టాక్ ప్రచారం జరుగుతోంది.ఆ నెగిటివిటీని మొత్తం తూడ్చి పెట్టే విధంగా ట్రైలర్ ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా ఉన్నారు.
ఇక సినిమా విడుదలకు నెల రోజుల సమయం మాత్రమే ఉంది.

దాంతో ఈ సినిమా అదనపు షో లు మరియు టికెట్ల రేట్ల పెంపు కోసం అనుమతులు ఇవ్వాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను చిత్ర నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారు.ఇప్పటికే అందుకు సంబంధించిన అనుమతి కూడా వచ్చిందని… త్వరలోనే ఆ విషయాలను చిత్ర యూనిట్ సభ్యులు వెళ్లడించే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతోంది.భారీ ఎత్తున అంచనాలు ఉన్న సలార్ సినిమా యొక్క టికెట్ల రేట్లు( Ticket Rates ) తెలుగు రాష్ట్రాల్లో 100 నుంచి 150 రూపాయల వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొదటి వారం రోజుల్లో సలార్ సినిమా టికెట్లు వెయ్యి రూపాయల వరకు పెరగడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో( Telugu States ) దాదాపుగా వంద బెనిఫిట్ షో లకు ఏర్పాట్లు చేస్తున్నారు.దాంతో మొదటి రోజు భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సలార్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.శృతి హాసన్( Shruti Haasan ) మరియు ఇతర యూనిట్ సభ్యులు రెండు వారాల పాటు ప్రమోషన్ లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.