నిజామాబాద్ లో మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పేదల కోసం బీజేపీ ఒక్క మంచి పనైనా చేసిందా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.రైతుబీమా లాగా కోటి కుటుంబాలకు రూ.5 లక్షల బీమా ఇస్తామన్నారు.రూ.400 కే వంట గ్యాస్ అందిస్తామన్న మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ కాకమ్మ కథలు నమ్మి మోసపోవద్దని చెప్పారు.ఈ క్రమంలోనే కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.