ఇటీవలే కాలంలో చాలామంది యువత ప్రేమలో పడడం సర్వసాధారణం అయిపోయింది.అయితే నూటికి 5 లేదా 10 శాతం మంది మాత్రమే వివాహ బంధంతో ఒకటవుతున్నారు.
మిగిలిన వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్లడం లేదు.అందుకు కారణం ఏమిటంటే.
ప్రేమికుల మధ్య గొడవలు జరగడం సహజమే.అయితే కొంతమంది చిన్న చిన్న గొడవలు జరిగిన బ్రేకప్ చెప్పేస్తారు.
ఇలాంటి కోవలోనే ఓ ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో తట్టుకోలేకపోయినా ప్రియుడు క్షణికావేశంలో ఆమె గొంతు కోసి హత్య చేసిన ఘటన కర్ణాటకలో( Karnataka ) చోటుచేసుకుంది.సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.తేజస్ అనే యువకుడు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు.ఇతనికి అదే కాలేజీలో చదివే 20 ఏళ్ల యువతి పరిచయం అయింది.వీరి పరిచయం కొద్ది రోజులకే ప్రేమగా మారింది.కొంతకాలం వీరి ప్రేమాయణం సాఫీగానే సాగింది.కానీ గత కొంతకాలంగా ఈ ప్రేమికుల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవ జరగడం ప్రారంభమైంది.
దీంతో విసుగుచెందిన ఆ యువతి తేజస్ కు బ్రేకప్( Breakup ) చెప్పి దూరంగా ఉండడం మొదలుపెట్టింది.

తనను దూరం పెట్టడం తట్టుకోలేకపోయినా తేజస్ ఎలాగైనా తన ప్రియురాలిని హతమార్చాలని అనుకున్నాడు.శుక్రవారం తనతో మాట్లాడాలని ఓ ఏకాంతంగా ఉండే ప్రదేశానికి తన ప్రియురాలిని పిలిచాడు. ఆ యువతి అక్కడికి వచ్చాక తన ప్లాన్ ప్రకారం తనతో తెచ్చుకున్న కత్తితో ప్రియురాలి గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు.
రక్తపు మడుగులో విగత జీవిలా పడి ఉన్న ఆ యువతిని స్థానికులు చూసి వెంటనే ఆసుపత్రికి తరలించారు.కానీ అప్పటికే ఆ యువతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
వైద్యులు పోలీసులకు సమాచారం అందించడంతో హాస్పటల్ కు చేరుకున్న పోలీసులు జరిగిన ఘటనపై హత్య కేసు( Murder ) నమోదు చేసుకుని, నిందితుడు తేజస్ ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.







