రీసెంట్ టైమ్‌లో ‘డ్యాన్సింగ్ కాక్టస్ టాకింగ్ ప్లష్ టాయ్’( Dancing Cactus Talking Plush Toy ) అనే కొత్త బొమ్మ సూపర్ పాపులర్ అయ్యింది.ఇది టాకింగ్ టామ్ యాప్‌లాగా పరిసరాల్లో ఉన్న శబ్దాలను విని వాటిని తిరిగి టాయ్ వాయిస్‌లో చెప్తుంది.
ఆ సమయంలో అది డ్యాన్స్ కూడా చేస్తుంది.ఈ బొమ్మను ప్రముఖ మ్యూజిషియన్ దివ్యాన్ష్ శ్రీవాస్తవ( Musician Divyansh Srivastava ) కూడా ఉపయోగిస్తున్నాడు.
తాజాగా ఆ బొమ్మ ముందు తన ఫ్లూట్ వాయించాలని, దాన్ని వీడియో రికార్డ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.అలానే చేస్తూ వీడియో రికార్డ్ కూడా చేశాడు.
ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో దివ్యాన్ష్ ఫ్లూట్ సౌండ్‌ను బొమ్మ చక్కగా అనుకరించి బ్యూటిఫుల్ మ్యూజిక్ ప్రొడ్యూస్ చేయడం మనం గమనించవచ్చు.వీడియోలో దివ్యాన్ష్( Divyansh ) తన ఫ్లూట్‌తో డివోషనల్ ట్యూన్ ప్లే చేయడం వినిపించింది.అతను ఆపివేసినప్పుడు, బొమ్మ డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తుంది, ట్యూన్‌ను అందమైన, మెలోడీస్ రీతిలో రిపీట్ చేస్తుంది.

దివ్యాంశ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను పంచుకున్నాడు.బొమ్మను తన కొత్త ఫ్రెండ్, శిష్యుడు అని పిలిచాడు.వీడియో షేర్ చేసిన కొంత సేపటికే వైరల్ అయింది.చాలా మంది ఇతర యూజర్లు దీనిని వారి సొంత పేజీలలో మళ్లీ పోస్ట్ చేశారు.వీడియోని షేర్ చేసిన పేజీలలో ఒకటి ఇండియన్ మ్యూజిషియన్స్ హబ్, దీనికి పెద్ద సంఖ్యలో మ్యూజిక్ లవర్స్ ఉన్నారు.ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 64,000 కంటే ఎక్కువ లైక్‌లు, చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి.
దివ్యాంశ్ తర్వాత బొమ్మతో కూడిన మరో వీడియోను పోస్ట్ చేశాడు, ఇందులో ‘బెల్లా సియావో’పై జుగల్‌బందీ ప్రదర్శించారు.ఈ వీడియో కూడా నెటిజన్లను ఆకట్టుకుంది.
డ్యాన్సింగ్ కాక్టస్ టాకింగ్ ప్లష్ టాయ్ దానితో ఆడుకునే వారితో సరదాగా మాట్లాడటమే కాగా మెలోడీ మ్యూజిక్ సృష్టించగలదని చూపించింది.ఇది అన్ని వయసుల వారికి ఆనందాన్ని, వినోదాన్ని కలిగించే బొమ్మ.







