ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది.పార్టీపై అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు ఇప్పటికే బీఆర్ఎస్ ను వీడుతున్నారన్న సంగతి తెలిసిందే.
తాజాగా ఖమ్మంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మందడపు మనోహర్ రావు సతీమణి, మున్సిపల్ 18వ డివిజన్ కార్పొరేటర్ మందడపు లక్ష్మీ మనోహర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.
జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమక్షంలో లక్ష్మీ మనోహర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.ఈ క్రమంలో లక్ష్మీ మనోహర్ కు తుమ్మల కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.







