ఖమ్మం జిల్లాలోని పైనంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రెండు సార్లు కేసీఆర్ సీఎం అయినా తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారని పొంగులేటి ప్రశ్నించారు.నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇళ్లు, రేషన్ కార్డులు ఏమీ ఇవ్వలేదని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.భూమిలేని పేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పారు.ప్రతి ఇంటికి 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు.