పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా రూ.340 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ రూ.340 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.దీని ద్వారా పల్నాడుకు కృష్ణమ్మ జలాలను అందించబోతున్నామని పేర్కొన్నారు.
ప్రాజెక్టుకు కేంద్ర అటవీశాఖ అనుమతులన్నీ వచ్చాయన్న సీఎం జగన్ అన్ని పర్మిషన్లతోనే ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు.కాగా వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ పథకం కింద రూ.340.26 కోట్ల వ్యయంతో వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.ఈ పథకం ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగలకుంటతో పాటు కండ్లకుంట గ్రామాల పరిధిలోని సుమారు 24,900 ఎకరాలకు పైగా ఆయుకట్టుకు సాగునీరు అందించనున్నారు.అయితే ఏపీలో పూర్తిగా పైపు లైన్ల ద్వారా నీరు అందించే తొలి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.







