ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.వైసీపీ సర్కార్ బీసీలను మోసం చేసిందని ఆరోపించారు.
జనాలు లేక బస్సు యాత్రను వాయిదా వేసుకున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు.తమ పార్టీకి చెందిన నేత బీటెక్ రవిని చంపేందుకు యత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈసారి జగన్ కు పులివెందులలో ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







