ప్రత్తి తీతల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే అధిక దిగుబడులు..!

తొలకరి చినుకుల సమయంలో ప్రత్తి విత్తిన ప్రాంతాల్లో ఇప్పటికే ప్రత్తిని తీతలు మొదలయ్యాయి.ప్రత్తితీతలు ఏ సమయంలో జరపాలి.

 High Yields Only If These Precautions Are Taken In Cotton Fields , Cotton Field-TeluguStop.com

ప్రత్తి ( cotton ) నిల్వలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుంటే మార్కెట్లో మంచి ధరకు అమ్మవచ్చు.సాధారణంగా మెట్ట ప్రాంతాల రైతులు అధిక విస్తీర్ణంలో ఈ ప్రత్తి పంటను సాగు చేస్తున్నారు.

బి.టి రకాల రాకతో సాగు విస్తీర్ణం మరింత పెరిగింది.

మే చివరి వారం నుంచి జూలై రెండవ వారం వరకు ప్రత్తి పంటను విత్తుతారు.ఎంతో కష్టపడి పండించిన ప్రత్తి పంటలో శీతల సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నాణ్యమైన ప్రత్తిని పొందవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.

ఏ రకమైన ప్రత్తి పంటను సాగు చేసిన.ప్రత్తిని ఏరే సమయం కూడా దాన్ని నాణ్యతను ప్రభావితం చేస్తుంది. శీతాకాలంలో ( winter )ఉదయం పూట మంచు కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ప్రత్తి తీతలను తీయాలి.పూర్తిగా పగిలిన ప్రత్తికాయ నుంచి మాత్రమే ప్రత్తిని తీయాలి.

మొక్కలో కొన్ని కాయలు పగిలి, మరికొన్ని కాయలు సరిగ్గా పగలకుండా ఉంటాయి.పూర్తిగా పగిలిన కాయనుండి తీసిన ప్రత్తి నాణ్యమైనది.

ఈ విషయం రైతులు గుర్తుంచుకోవాలి.

Telugu Agricultural, Agriculture, Cotton Fields, Yieldscotton-Latest News - Telu

ఇక ఎప్పటికప్పుడు పగిలిన కాయల నుంచి ప్రత్తిని తీయడం మంచిది.ఆలస్యం చేస్తే వర్షాలు, మంచు, వాతావరణ పరిస్థితుల వల్ల ప్రత్తి రంగు మారి నాణ్యత దెబ్బతింటుంది.పగిలిన ప్రత్తి కాయల నుంచి సేకరించిన ప్రత్తి, పగలని కాయల నుంచి సేకరించిన ప్రత్తిని ఎట్టి పరిస్థితులలో కలిపి మార్కెట్ చేయకూడదు.

ఇలా చేస్తే రైతులు ధరను కోల్పోతారు.మొదటి రెండు లేదా మూడు తీతల్లో వచ్చే ప్రత్తి అధిక నాణ్యతగా ఉంటుంది.కనుక దీన్ని వేరుగా మార్కెట్ చేస్తే మంచి ధర పొందవచ్చు.

Telugu Agricultural, Agriculture, Cotton Fields, Yieldscotton-Latest News - Telu

ప్రత్తి తీసే కూలీలు హడావిడిలో చెత్తాచెదారంతో కలిపి తీతలు చేస్తుంటారు.ఇలా చేస్తే ప్రత్తి నాణ్యత కోల్పోతుంది.అలాగే ప్రత్తి తీసిన వెంటనే నీడలో మండెలు వేయాలి.

ఇలా చేస్తే గింజ బాగా గట్టి పడడమే కాకుండా అందులోని తేమ శాతం తగ్గి, ప్రత్తి శుభ్రంగా ఉంటుంది.ప్రత్తిను నిల్వ చేసే సంచులలో ఎలాంటి దుమ్ముదులి లేకుండా చాలా శుభ్రంగా ఉంటే ప్రత్తి రంగు మారే అవకాశం ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube