అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు అందించింది.తమకు వచ్చిన ఎలక్ట్రోరల్ బాండ్స్ వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
ఈ మేరకు ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు సీల్డ్ కవర్ లో వివరాలు ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలకు చెందిన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు కోశాధికారులకు ఈసీ నోటీసులు పంపించింది.
ఈనెల 2వ తేదీన భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈసీ నోటీసులు ఇచ్చిందని సమాచారం.







