పరిపూర్ణ నాయకుడిగా ఆవిష్కరించుకుంటున్న కేటీఆర్!

సాధారణంగా ఎన్నికల ప్రచారం అనగానే రాజకీయ నాయకులు అబద్దాలు అర్థసత్యాలతో హోరేత్తిస్తుంటారు.తాము చేసింది గోరంత అయినా కొండంత అభివృద్ది చేశామని తాము తప్ప ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించే నాయకుడు లేడు అన్నట్లుగా స్వకుచమర్దనం చేసుకుంటారు.

 Ktr Is Emerging As A Perfect Leader! , Ktr, Brs Party , Congress , Bjp, Tela-TeluguStop.com

అలానే ప్రతిపక్షాల గత పరిపాలన మొత్తం అవినీతిమయమేనని సర్టిఫై చేస్తూ ఉంటారు.అయితే తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా వివిధ మీడియా వర్గాలతో మాట్లాడుతూ బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) చేస్తున్న వ్యాఖ్యలు ఆయన తనను తాను సరికొత్త లీడర్ గా ఆవిష్కరింప చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది .

Telugu Brs, Cm Kcr, Congress, Perfect, Telangana, Ts-Telugu Political News

తమ పరిపాలన లో కూడా కొన్ని తప్పులు జరుగి ఉండొచ్చని అయితే వాటిని కచ్చితంగా సరి చేసుకుంటామని చెప్పడం ద్వారా తమ పరిపాలనలో కూడా కొన్ని వైఫల్యాలు ఉన్నాయని ఆయన అంగీకరించినట్లయ్యింది .అంతే కాకుండా ఇతర పార్టీల నాయకులతో తనకు వ్యక్తిగత విభేదాలు ఉండవని తన అంతిమ లక్ష్యం తెలంగాణ( Telangana ) సర్వతోముఖంగా అభివృద్ధి చెందటమే అన్నట్లుగా చెప్పడం చూస్తే ఆయన ఖచ్చితంగా సాంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా పరిణితి చెందిన లీడర్ గా కనిపిస్తున్నాడని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Telugu Brs, Cm Kcr, Congress, Perfect, Telangana, Ts-Telugu Political News

తమ ప్రవర్తనకు మాటలకు నిజాయితీగా లంకె వేసే మనుషులు ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు.తమది మాత్రమే గొప్ప రాజకీయ అన్న స్థానే తాము నేర్చుకుంటామని సరిదిద్దుకుంటామని చెప్తున్న మాటలు చూస్తే కచ్చితంగా పరిణితి చెందిన రాజకీయం కిందే భావించాలి. ఎన్నికల్లో డబ్బులు పంచడంపై కూడా ఆయన తన స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రకటించారు.అసలు తనకు తాయిలాలతో ఓటర్ ను ఆకర్శించడం నచ్చదని అయితే తప్పనిసరి వాతావరణంలో కొన్నిసార్లు రాజీ పడాల్సి వస్తుందంటూ చెప్పుకొచ్చారు.

గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే తనను తాను ఆత్మ పరిశీలన చేసుకొన్న నాయకుడిగా కేటీఆర్ వాఖ్యలకు కచ్చితంగా ప్రజల మద్దతు ఉంటుందని రాష్ట్రం లో మెజారిటీ ఓటర్లుగా ఉన్న యువతను ఆకట్టుకునేలా కేటీఆర్ వ్యవహార శైలి ఉందని మాత్రం వ్యాఖ్యలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube