సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటు ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక అలాంటి వాళ్లలో కొందరు నటులు హీరోలుగా మారి సినిమాలు చేస్తూ ఉంటారు.
ఇక ఇప్పుడు వెన్నెల కిషార్( Vennela kishore ) కూడా చారి 111 అనే సినిమా( Chaari 111 ) చేస్తున్నారు.అయితే ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక సినిమా మొత్తం ఆయన ఒక్కడే తన భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తూన్నాడని తెలుస్తుంది.
కాబట్టి ఈ సినిమా బాధ్యత మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని మోయాల్సి ఉంటుంది.అలాగే వెన్నెల కిషోర్ వైవిధ్యమైన పాత్రను పోషిస్తూ శభాష్ అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు గా చిత్ర యూనిట్ తెలియజేస్తుంది.
ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ ను చూస్తే మనకు అర్థమవుతుంది ఇదొక స్పై థ్రిల్లర్ జానర్ లో నడిచే కథ అని ఇక ఈ సినిమా మీద వెన్నెల కిషోర్ భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అయితే ఆయనకి కూడా ఇప్పుడు అడివి శేషు సత్యం రాజేష్ లాంటి వారు ఎలాగైతే వాళ్ళ స్టైల్ ని నమ్ముకొని సినిమాలు తీస్తూ హీరోలుగా మారి హిట్లు కొడుతున్నారో తను కూడా అలానే సినిమాలు తీస్తూ హిట్లు కొట్టె అవకాశం అయితే ఉంది.మరి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాతో ఆయన ఎంతవరకు రాణిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ మాత్రం( Chaari 111 First look ) అద్భుతంగా ఉన్నప్పటికీ ఈ సినిమా ద్వారా ఆయన ఎంతవరకు రాణిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…అయితే ఈ సినిమా లో చివర్లో ఒక చిన్న పాత్ర లో మెగాస్టార్ చిరంజీవి కనీంచబోతున్నరు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి…
.