సిరిసిల్ల బీజేపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నఆశీర్వాదించండి*బిజెపి సిరిసిల్ల(BJP Sircilla ) నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పలు గ్రామాలలో రాణి రుద్రమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకేమి కావాలో మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తెలుసునని అన్నారు.
గంభీరావుపేట మండలంలోని మల్లారెడ్డిపేట,లింగన్నపేట గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని పేద మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు ప్రతి ఇంటికి 12వేల రూపాయలు ఇచ్చి టాయిలెట్లు నిర్మించారన్నారు.
మహిళలు కట్టెల పొయ్యిల మీద వంట చేస్తూ పోగచూరి ఇబ్బందులు పడొద్దని ఇంటింటికి గ్యాస్ సిలిండర్( Gas cylinder ) లు అందజేశారని ఆమె గుర్తు చేశారు.దేశం మొత్తాన్ని కరోనా కుదేపేసినప్పుడు దేశంలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేశారన్నారు.
ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు కరువు పని కల్పించారన్నారు.హరితహారం కింద ఇయ్యాల్ల పల్లెలు పచ్చగా మారాయన్నారు.
స్మశాన వాటికల నిర్మాణాలకు,రైతు వేదికలకు కేంద్రం నిదులిచ్చిందన్నారు.పల్లెలు పచ్చగా వర్థిల్లుతున్నాయంటే దానికి మన మోడి కారణమన్నారు.9ఏండ్ల కిందట తెలంగాణలో రెండు లక్షలు ఇండ్లు నిర్మించుకోవాలని మోడీ నిదులు పంపుతే రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాలేదన్నారు.పక్క రాష్ట్రం ఆంద్రప్రదేశ్ లో 2లక్షల ఇండ్లు నిర్మించుకున్నారన్నారు.
ఊరోకో నాలుగు లిక్కర్ షాప్ లు మాత్రం పెట్టారన్నారు.
యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశారన్నారు.
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, అని దళితులకు మూడేకరాలు భూమి ఇవ్వలేదన్నారు.అందుకే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు.
సిరిసిల్ల బీజేపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా నాకు ఇక్క చాన్స్ ఇచ్చి నన్ను ఆశీర్వదించాలన్నారు.సిరిసిల్ల బీజేపీ అభ్యర్థిగా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు.
బిజెపిలో మల్లారెడ్డిపేట( Mallareddipeta ) గ్రామం నుంచి 50 మంది యువకుల చేరిక గంభీరావుపేట మండలంలోని మల్లారెడ్డిపేట గ్రామం నుంచి 25 మంది యువకులు బీజేపీలో చేరారు.బీజేపీ ఎమ్యెల్యే అభ్యర్థి రాణి రుద్రమ యువకులకు బీజేపీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు.
నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం అబివృద్ది చెందుతుందని యువకులు నమ్మి బీజేపీలో చేరుతున్నామని యువకులు తెలిపారు.రాణి రుద్రమ గెలుపుకోసం అహర్నిశలు పని చేస్తామని చెప్పారు.







