ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్లకు కస్తూరి శంకర్( Kasturi Shankar ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సీరియళ్లలో నటిస్తున్న కస్తూరి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా కూడా పలు సందర్భాల్లో వార్తల్లో నిలుస్తున్నారు.
అన్నమయ్య, పెద్దరికం, భారతీయుడు సినిమాలు ఈ నటికి మంచి పేరును తెచ్చిపెట్టాయి.సోషల్ మీడియాలో సైతం ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
కస్తూరి శంకర్ తన అభిప్రాయాలను సోషల్ మీడియా( Social media ) ద్వారా వ్యక్తం చేయడం ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.కొన్నిసార్లు కస్తూరి శంకర్ బోల్డ్ గా చేసే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఇంటింటి గృహలక్ష్మి సీరియల్( Indita Grilahakshmi serial ) కస్తూరి శంకర్ ను సాధారణ అభిమానులకు మరింత దగ్గర చేసిందనే చెప్పాలి.కస్తూరి శంకర్ కు ప్రస్తుతం సినిమా ఆఫర్లు సైతం ఎక్కువగానే వస్తుండటం గమనార్హం.
కెరీర్ తొలినాళ్ల గురించి కస్తూరి మాట్లాడుతూ భారతీయుడు సినిమాలో ( bharateeyudu movie )నటించే సమయానికి నా వయస్సు చిన్న వయస్సు అని శంకర్( Shankar ) డైరెక్షన్ లో నటించడం ఎంత గొప్ప అవకాశమో తర్వాత తెలిసిందని ఆమె చెప్పుకొచ్చారు.భారతీయుడు సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మొదట నాకే వచ్చిందని ఆ సినిమాలో ఛాన్స్ కోసం దర్శకుడికి బికినీ ఫోటోలు సైతం పంపానని కస్తూరి శంకర్ అన్నారు.
ఆ సినిమాలో చివరకు ఊర్మిళను( Urmila ) ఫైనల్ చేశారని కస్తూరి శంకర్ పేర్కొన్నారు.నాకు కమల్ హాసన్ చెల్లి పాత్ర ఇచ్చి సరిపెట్టారని అలా భారతీయుడి కూతురి పాత్రలో ఆ సినిమాలో నటించానని కస్తూరి శంకర్ వెల్లడించారు.సినిమాలో కీలక పాత్ర అని చెప్పడం వల్లే భారతీయుడు సినిమాలో ఆ పాత్రలో నటించానని ఆమె చెప్పుకొచ్చారు.కస్తూరి శంకర్ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.