వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వచ్చాయని ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్పారు.
ఎన్నికల్లో పార్టీకి ఒకరు నిలబడతారన్న సీఎం కేసీఆర్ అభ్యర్థితో పాటు పార్టీల చరిత్ర చూడాలని తెలిపారు.అంతేకానీ ఎవరికి పడితే వారికి ఓటు వేయొద్దని చెప్పారు.
ఓటు మీ ఐదేళ్ల భవిష్యత్ ను నిర్దేశిస్తుందన్నారు.కృష్ణా, గోదావరి పారుతున్నా గతంలో మంచి, సాగునీటి కష్టాలు ఉండేవన్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తాగు, సాగునీటి సమస్యలతో పాటు కరెంట్ సమస్యలను పరిష్కరించుకున్నామని తెలిపారు.ప్రజల కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.







