దీపావళి( Diwali ) వస్తే చాలా కంపెనీలు, యజమానులు తమ దగ్గర పని చేసే వర్కర్లకు బోనస్ లు ఇస్తారని తెలిసిందే.అయితే ఓ యజమాని దీపావళికి బోనస్ డబ్బులు ఇవ్వకపోవడంతో ఇద్దరూ వర్కర్లు తమ యజమానిని హత్య చేసిన ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్ ( Nagpur in Maharashtra )లో చోటుచేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.నాగపూర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే కుహి ఫటా సమీపంలో ఉండే ఓ ధాబాలో నెల రోజుల క్రితం మధ్యప్రదేశ్ లోని ఓ లేబర్ కాంట్రాక్టర్ ద్వారా ఛోటు, ఆది అనే ఇద్దరు వర్కల్లు రాజ ధేంగ్రే( Raja Dhengre ) అనే వ్యక్తికి చెందిన ధాబాలో వర్కర్లుగా చేరారు.
ఇటీవలే యజమానితో కలిసి భోజనం చేస్తున్న సమయంలో ఈ ఇద్దరు వర్కర్లు తమకు దీపావళి బోనస్ ఇవ్వాలని యజమానిని అడిగారు.అయితే యజమాని దీపావళికి ఎలాంటి బోనస్ ఇవ్వలేదు.
కానీ మరి ఎప్పుడైనా ఇస్తానని యజమాని చెప్పాడు.అడిగిన వెంటనే యజమాని డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహించిన నిందితులు మంచి సమయం చూసుకుని యజమానిని హతమార్చాలని అనుకున్నారు.

శనివారం రాత్రి యజమాని నిద్రపోతుండగా అతని మెడకు తాడు బిగించి, తలపై బండరాయితో బలంగా కొట్టడమే కాకుండా ముఖాన్ని ఛిద్రం చేశారు.ఆ తర్వాత మృతదేహాన్ని ఒక బొంతలో కప్పి ధాబాలో ఓ మూలన పడేసి యజమాని కారులోనే అక్కడి నుంచి పరారయ్యారు.నిందితులు వెళుతున్న కారు విహార్ గావ్ సమీపంలో ఉండే నాగపూర్- ఉమ్రెడ్ రహదారిపై ఉండే డివైడర్ ను ఢీ కొట్టింది.దీంతో నిందితులకు గాయాలయ్యాయి.కారును అక్కడే వదిలేసి పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి.

మరొకవైపు మృతిచెందిన యజమాని కుమార్తె ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె తండ్రి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పక్కనే ఉన్న పాన్ దుకాణానికి ఫోన్ చేసింది.ఆ వ్యక్తి ధాబాకు వెళ్లి చూసేసరికి రాజు ధేంగ్రే రక్తపు మడుగులో విగత జీవిల పడి ఉండడం చూసి వెంటనే ఆమె కూతురికి ఫోన్ చేసి విషయం చెప్పాడు.ఆమె పోలీసులకు ఫోన్ చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించాడు.
ఈ రాజు ధేంగ్రే మాజీ సర్పంచ్ తో పాటు స్థానికంగా రాజకీయ పలుకుబడి వ్యక్తి ఉండడం కారణంగా స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా.
రాజకీయ ప్రత్యర్థుల కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా కేసును దర్యాప్తు చేస్తున్నారు.







