రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీకి షాక్ తగిలింది.ఆ పార్టీకి తుల ఉమ రాజీనామా చేశారని తెలుస్తోంది.
ఈ క్రమంలో బీజేపీకి గుడ్ బై చెప్పిన ఆమె గులాబీ గూటికి చేరనున్నారని సమాచారం.
సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది.
అయితే వేములవాడ నియోజకవర్గ అభ్యర్థిగా తుల ఉమను బీజేపీ మొదటగా ప్రకటించింది.చివరి నిమిషంలో బీ-ఫామ్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన తుల ఉమ బీజేపీకి రాజీనామా చేశారు.
చివరి నిమిషంలో బీ-ఫామ్ వేరే వాళ్లకు ఇచ్చి తనను అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.బీఫామ్ లే సరిగా ఇవ్వలేని పార్టీ అధిష్టానం బీసీ నినాదంతో ముందుకు వెళ్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
.






