టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు లగ్జరీ లైఫ్ ను ఎంతగానో ఇష్టపడతారు.ధరించే దుస్తులు, ఉపయోగించే గ్యాడ్జెట్స్ విషయంలో టాలీవుడ్ స్టార్స్ తీసుకునే జాగ్రత్తలు అన్నీఇన్నీ కావు.
అయితే టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ కు సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఒకటి వైరల్ అవుతుండగా ఆ ఫోటోలో వెంకటేశ్( Venkatesh ) పగిలిన స్క్రీన్ తో ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ తో కనిపించడం గమనార్హం.

వెంకటేశ్ రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు 10 నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.సెలబ్రిటీలంతా ఐఫోన్లు వాడుతుండగా వెంకీ మాత్రం సాధారణ ఫోన్ ను వాడుతున్నారు.ఇంత సింపుల్ గా ఉన్నారంటే వెంకటేశ్ గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వెంకీ ఫోన్ నిజంగా పగిలిందా లేక స్క్రీన్ గార్డ్ పై గీతలు పడ్డాయా అనే ప్రశ్నకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.ఇతర స్టార్ హీరోలకు భిన్నంగా వెంకటేశ్ సింపుల్ గా ఉంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.

రామ్ చరణ్( Ram Charan ) తన ఇంట్లో సినీ ప్రముఖులకు పార్టీ ఇవ్వగా ఈ పార్టీకి ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు.వెంకటేశ్ ప్రస్తుతం సైంధవ్ సినిమాలో నటిస్తుండగా శైలేష్ కొలను డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. సైంధవ్ సినిమా( Saindhav )లో వెంకటేశ్ వైల్డ్ రోల్ లో కనిపిస్తున్నారు.ఈ సినిమాతో మరో సక్సెస్ దక్కుతుందని వెంకటేశ్ నమ్ముతున్నారు.కొన్నేళ్ల క్రితం వరకు వేగంగా సినిమాలు చేసిన వెంకటేశ్ ప్రస్తుతం ఒక సినిమాను పూర్తి చేసిన తర్వాతే మరో సినిమాలో నటిస్తున్నారు.వెంకటేశ్ కు భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో భారీ హిట్లు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
వెంకటేశ్ ఫ్యామిలీ కథంశాలలో నటించాలని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.వెంకటేశ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.







