తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తెలంగాణ కోసం రాజీనామా చేయని వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు.
ఉస్మానియా వర్సిటీ విద్యార్థులను రేవంత్ రెడ్డి అవమానించారని, రైతులను బిచ్చగాళ్లతో పోల్చారని మంత్రి హరీశ్ రావు అన్నారు.అంతేకాకుండా గిరిజనుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా రేవంత్ మాట్లాడుతున్నారన్నారు.
కేసీఆర్ పై రేవంత్ రెడ్డి భాష దుర్మార్గంగా ఉంటుందని మండిపడ్డారు.ఈ క్రమంలోనే వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందా అని ప్రశ్నించారు.
ఉచిత కరెంట్ ను ఉత్త కరెంట్ గా చేసిందే కాంగ్రెస్ అని విమర్శించారు.







