ఒక మనిషి చేసిన మంచి పనులను మర్చిపోయి చెడు పనులను గుర్తుంచుకునే అవలక్షణం చాలామంది మనుషులకు ఉంటుంది.ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా అతని గురించి చెడుగా మాట్లాడే వారు ఉంటారు.
పోయిన వ్యక్తి గురించి కొన్ని మంచి మాటలు చెప్పుకుందామనే బుద్ధి చాలా తక్కువ మందికి ఉంటుందని చెప్పవచ్చు.కొందరైతే ఎక్కడో విన్నది నమ్మేసి అవే మాటలను అందరికీ చెప్పేస్తుంటారు.
అవి అబద్ధాలైనా సరే చివరికి నిజాలుగా కూడా మారుతుంటాయి.తాజాగా తుది శ్వాస విడిచిన చంద్రమోహన్ ( Chandramohan )గురించి కూడా మంచి మాట్లాడటం మానేసి చెడు మాట్లాడటం మొదలుపెట్టారు కొందరు.
చంద్రమోహన్ పరమ పిసినారి అని, భోజనప్రియుడు అని, సొంత ఖర్చులు కూడా నిర్మాతల కట్టేలా చేసే వ్యక్తిత్వం కలవాడని మాట్లాడుతున్నారు.నిజానికి తాను ఒక భోజన ప్రియుడినని చంద్రమోహన్ స్వయంగా చెప్పుకున్నాడు.
అలా తినడం వల్లే 70 ఏళ్ల దాకా ఆరోగ్యంగా ఉంటూ సినిమాల్లో నటించగలిగాడు.

ఇక ‘పిసినారి’ అంటూ తనను చులకన చేసి మాట్లాడిన వారికి కూడా సరైన సమాధానం ఇచ్చాడు.చంద్రమోహన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “సినిమా ఫీల్డ్ గ్యారెంటీ లేని ప్రొఫెషన్.మనీ విషయంలో కేర్ తీసుకోని యాక్టర్స్ పరిస్థితి చివరికి ఎంత దారుణంగా మారిందో నేను ప్రత్యక్షంగా చూశాను.
హీరో రేంజ్‌లో నా సంపాదన ఉండదు కానీ నాకు వచ్చిన సంపాదనలో చాలావరకు సేవ్ చేయడానికి ట్రై చేస్తూ వచ్చాను.అలా పొదుపు చేసిన డబ్బే ఇప్పుడు నన్ను కాపాడుతోంది.” అని అన్నారు.ఇందులో అసలు తప్పేం లేదని చెప్పవచ్చు.
మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్( Financial Planning ) చేసుకునే ప్రతి ఒక్కరి మనస్తత్వం ఇలానే ఉంటుంది.అలాంటి వారిని పిసినారి అని లేబుల్ చేయడం పొరపాటే అవుతుంది.
సినిమా అనేది మిగతా వాటిలాగానే ఒక ప్రొఫెషన్.అందులో కష్టపడితేనే డబ్బులు వస్తాయి.
ఏదైనా తేడా వస్తే చివరికి రూపాయి సంపాదన కూడా ఉండదు.కానీ ప్రజల మనసులో సినిమా వారంటేనే దానధర్మాలు చేసే దానకర్ణులు.
అందువల్ల దానాలు చేయని వారందరినీ పెద్ద పిసినారని ట్యాగ్ చేయడం అందరికీ అలవాటైపోయింది.

ఇకపోతే నిర్మాతల మీద తన ఖర్చులు రుద్దే నటుడు చంద్రమోహన్ అని కొందరు నిరాధార విమర్శలు చేస్తుంటారు.ఈ ఆరోపణను కొందరు బలంగా కూడా వినిపించారు.అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఈజీగా అర్థం చేసుకోవచ్చు.
ఎందుకంటే చంద్రమోహన్ 900 కు పైగానే సినిమాల్లో నటించాడు.అతనితో మళ్లీ మళ్లీ వర్క్ చేస్తూ సినిమాలు తీసిన నిర్మాతలు ఉన్నారు.
నిర్మాతలను పట్టిపీడిస్తూ అన్నీ ఖర్చులు వారి మీద రుద్దే వ్యక్తిత్వం చంద్రమోహన్ కి ఉండి ఉంటే.ఒకసారి పని చేసినా నిర్మాతలు( Producers ) మళ్లీ అతడిని తీసుకోవడానికి నిరాకరించేవారు.
దీనివల్ల చంద్రమోహన్ కి ఇండస్ట్రీలో ఒక్క మూవీ ఆఫర్ కూడా వచ్చి ఉండేది కాదు.కానీ అతనికి వద్దన్నా సినిమా ఆఫర్లు వచ్చేవి.
అందుకు గల కారణం ఏంటంటే అతను నిర్మాతలను అనవసరంగా ఒక రూపాయి కూడా అడిగేవాడు కాదు.నిర్మాతలు ఇచ్చిన ఆఫర్ ప్రకారమే అతను డబ్బులు తీసుకునేవాడు.
ఏదైనా వినిపించినా లేదా ఎక్కడైనా చదివినా అందులో నిజం ఎంతో తెలియకుండా నమ్మేసి అదే మాటను ఇతరుల ముందు అనటం ప్రజలకు బాగా అలవాటయింది.దీనివల్ల అనవసరంగా మంచి వ్యక్తిత్వం ఉన్నవారు కూడా చెడ్డ వ్యక్తులుగా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు.







