Rangasthalam Mahesh : నువ్వెక్కువ మాట్లాడుతున్నావ్ తగ్గించుకో అంటూ రామ్ చరణ్ సార్ వార్నింగ్ ఇచ్చారు: రంగస్థలం మహేష్

బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్గా సందడి చేస్తే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రంగస్థలం మహేష్ ( Rangasthalam Mahesh ) ఒకరు.ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్గా నటిస్తున్నటువంటి సినిమాలలో అవకాశాలు అందుకున్నారు.

 Rangasthalam Mahesh Intresting Comments About Hero Ram Charan-TeluguStop.com

పలు సినిమాలలో కమెడియన్గా నటిస్తున్నటువంటి మహేష్ రామ్ చరణ్ ( Ram Charan ) సుకుమార్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం (Rangadthalam) సినిమాలో నటించారు.ఈ సినిమాలో రామ్ చరణ్ కు స్నేహితుడి పాత్రలో నటించారు అయితే ఈ సినిమాలో మహేష్ నటనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి అప్పటినుంచి ఈయన రంగస్థలం మహేష్ గా మారిపోయారు.

ఇక ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకున్నటువంటి మహేష్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఎంత బిజీగా ఉన్నారు.ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మహేష్ రామ్ చరణ్ గురించి పలు విషయాలను వెల్లడించారు.రంగస్థలం సినిమాలో నటిస్తున్న సమయంలో మొదటిసారి నేను రామ్ చరణ్ సార్ గారిని చూసి అతనిని స్వయంగా కలిశానని తెలిపారు.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో మొదట్లో కాస్త భయపడ్డాను కానీ తర్వాత రామ్ చరణ్ గారితో మాట్లాడుతూ ఉంటే ఎంతో సరదాగా ఉండేదని తెలిపారు.

ఇక మహేష్ కాస్త ఎక్కువగా మాట్లాడతారు అనే విషయం మనకు తెలిసిందే.ఈయన మాట్లాడటం మొదలుపెట్టారు అంటే ఇక ఆపరు ఇలా తరచూ మాట్లాడుతూ తన మాటలతోనే అందరిని నవ్విస్తూ ఉంటారు.ఇలా మహేష్ ఎక్కువగా మాట్లాడుతూ ఉండడంతో రామ్ చరణ్ తనకు ఒక విలువైన మాట చెప్పారని తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రామ్ చరణ్ చెప్పిన మాట గురించి మహేష్ వెల్లడించారు.రామ్ చరణ్ గారు చిన్నప్పుడు తన తాతయ్య అల్లు రామలింగయ్య( Allu Ramalingaiah ) దగ్గర పడుకునే వారట అలాంటి సమయంలో అల్లు రామలింగయ్య తనకు ఒక మాట చెప్పారని అదే మాటే నాకు రాంచరణ్ గారు చెప్పారు అంటూ మహేష్ తెలిపారు.

నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉండడంతో కాస్త మాటలు తగ్గించుకో ఎప్పుడూ కూడా మనం మాట్లాడే మాటలకు చాలా విలువ ఉంటుంది.ఎప్పుడైతే మాట నీ నోట దాటి బయటకు వస్తుందో ఆ మాటకు నువ్వు బానిస… మాట నోట దాటదో అప్పుడు నువ్వే రాజు నాకు ఈ మంచి విషయాన్ని రామ్ చరణ్ గారు తెలిపారు.ఒకసారి పొరపాటున నోరు జారీ మనం ఎవరి గురించైనా ఏదైనా మాట్లాడితే ఆ మాటకు పూర్తిగా మనమే బానిసలు కావాలని అలా కాకుండా ఆచితూచి మాట్లాడితే మనమే రాజులమంటూ రామ్ చరణ్ గారు చాలా అద్భుతంగా చెప్పారని వెల్లడించారు.రామ్ చరణ్ ఈ మాటలను తూచా పాటిస్తారు కనుక ఆయన ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో ఆ మాటలు మాత్రమే మాట్లాడతారు అంతకుమించి మాట్లాడరంటూ మహేష్ తెలిపారు.

ఇక రామ్ చరణ్ సార్ గారు ఈ మాట చెప్పినప్పటి నుంచి నేను కొంత వరకు మాటలు తగ్గించాలని మహేష్ తెలిపారు.

https://www.facebook.com/watch/?v=7122489971136046&extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&ref=sharing&mibextid=6aamW6
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube