Siddu Jonnalagadda : రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ.. శర్వాతో సమానంగా ఎంత తీసుకుంటున్నాడంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ( Siddu jonnalagadda )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకోవడం తోపాటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వారిలో సిద్దు జొన్నలగడ్డ కూడా ఒకరు.

 Latest News About Hero Siddu Jonnalagadda-TeluguStop.com

కాగా సిద్దు జొన్నలగడ్డ తెలుగులో గుంటూరు టాకీస్,( Guntur Talkies ) కృష్ణ అండ్ హిస్ లీల, మా వింతగాథ వినుమా లాంటి సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా రచయితగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.

Telugu Dj Tillu, Guntur, Krishna Leela, Maavintha, Sharvanand, Tillu Square, Tol

ఇది ఇలా ఉంటే సిద్దు జొన్నలగడ్డ గత ఏడాది డీజే టిల్లు సినిమా( DJ Tillu )తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్గా నటించింది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇకపోతే ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ తదుపరి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.ఇక అందులో భాగంగానే సిద్దు నటిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమా( Tillu Square )వచ్చే ఏడాది విడుదల కానుంది.

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా హీరో సిద్దు జొన్నలగడ్డ కు సంబంధించిన ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.

Telugu Dj Tillu, Guntur, Krishna Leela, Maavintha, Sharvanand, Tillu Square, Tol

అదేమిటంటే హీరో సిద్దూ జొన్నలగడ్డ రెమ్యునరేషన్ ఇప్పుడు 10 కోట్లకు చేరిపోయిందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.కాగా ప్రస్తుతం హీరో సిద్దు చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి.ఈ రెండు ప్రాజెక్ట్ లకు పది కోట్ల రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.టిల్లు స్క్వేర్ కనుక బ్లాక్ బస్టర్ హిట్ అయితే సిద్దు రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

అయితే హిట్ లు లేని, హిట్ ల కోసం చూస్తున్న హీరో శర్వానంద్ ( Sharvanand )కూడా పది కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్.ఆ లెక్కన చూస్తే సిద్దు రెమ్యునరేషన్ రీజనబుల్ కదా అని కామెంట్ లు వినిపిస్తున్నాయి.

అంటే నిన్న కాక మొన్న వచ్చిన హీరో సిద్దు జొన్నలగడ్డ,శర్వానంద్ తో సమానంగా రెమ్యునరేషన్ ని అందుకుంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube