ప్రస్తుతం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల( Electric Vehicles ) హవా నడుస్తోంది.డీజిల్, పెట్రోల్ అధిక కారణంగా, పర్యావరణ కాలుష్యం కారణంగా చాలామంది ఎలక్ట్రిక్ కార్లను కొనేందుకు అధిక ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే ప్రముఖ కంపెనీలన్నీ సరికొత్త ఫీచర్లతో ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉండడంతో ఈ ఎలక్ట్రిక్ కారు కొనాలో తెలియక కొనుగోలుదారులు కాస్త గందరగోళంలో ఉన్నారు.భారత రోడ్లపై తిరుగుతున్న టాప్-5 ఎలక్ట్రిక్ కార్లు ఏమిటో చూద్దాం.
Tata Tigor EV:
భారత మార్కెట్లో ఉండే అత్యంత ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కార్లలో ఈ కారు కూడా ఒకటి.26kwh,74Bhp తో శక్తి పొందుతుంది.ఒకసారి చార్జింగ్ తో 315 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.కేవలం 5.7 సెకండ్ల కాలంలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.15A ప్లగ్,AC హోమ్ వాల్ చార్జర్ తో 9.4 గంటల సమయంలో ఫుల్ ఛార్జ్ అవుతుంది.అదే DC ఫాస్ట్ చార్జర్ తో ఒక గంటలో 50 నుంచి 80 శాతం వరకు చార్జింగ్ అవుతుంది.
Tata Nexon EV:
ఈ కారు మీడియం, లాంగ్ రేంజ్ బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.MR 123Bhp, 215 NM తో 30Kwh బ్యాటరీ ప్యాక్ తో శక్తి పొందుతుంది.ఒకసారి చార్జింగ్ తో గరిష్టంగా 323 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.కేవలం 8.9 సెకండ్ల కాలంలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.15A ప్లగ్ తో 10.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.7.2KW చార్జర్ తో నాలుగు పాయింట్ మూడు గంటల్లో 50 నుంచి 100% ఛార్జ్ అవుతుంది.
Citroen ec3 EV:
ఈ కారు 29.2KW బ్యాటరీ తో పాటు 76 Bhp, 143NM టార్క్ ను కలిగి ఉంది.ఒకసారి చార్జింగ్ చేస్తే గరిష్టంగా 320 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.15Amp ప్లగ్, సీ3 ఛార్జర్ తో 10.5 గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుంది.DC ఫాస్ట్ చార్జర్ తో( DC Fast Charger ) 57 నిమిషాల్లో 50 నుంచి 100% ఛార్జ్ అవుతుంది.
Tata Tiago EV:
ఈ కారు 19.2Kwh, 24Kwh బ్యాటరీ వేరియంట్లతో లభిస్తుంది.19.2Kwh వేరియంట్ ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే గరిష్టంగా 230 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.24Kwh వేరియంట్ ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే గరిష్టంగా 350 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.6.9 గంటల సమయంలో 15A ఛార్జర్ తో 19.2Kwh వేరియంట్ ఫుల్ ఛార్జ్ అవుతుంది.DC ఫాస్ట్ ఛార్జర్ తో 19.2Kwh, 24Kwh 50 నుంచి 100% చార్జింగ్ కేవలం 50 నిమిషాల్లో అవుతుంది.
MG Motor Comet:
ఈ కారు 17.3 Kwh బ్యాటరీ సామర్థ్యం తో ఉంటుంది.ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే గరిష్టంగా 230 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.42Bhp, 110NM టార్క్ ను విడుదల చేస్తుంది.5.5 గంటల్లో ఈ కారు ఫుల్ ఛార్జ్ అవుతుంది.