సాధారణంగా బైక్‌పై( Bike ) ఇద్దరు వెళ్తుంటారు.కొందరు నిబంధనలను అతిక్రమించి ముగ్గురు కూడా ప్రయాణిస్తుంటారు.
అయితే ఇలాంటి సందర్భాల్లో నిబంధనలు పట్టించుకోని వారికి ట్రాఫిక్ పోలీసులు( Traffic Police ) జరిమానాలు వేస్తుంటారు.అయితే కొందరు మాత్రం తమ తీరు మార్చుకోరు.
దీంతో పాటు ఇతర ప్రాంతాలకు ప్రయాణం అంటే ప్రస్తుతం చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోంది.అందులోనూ 2 కిలోమీటర్ల దూరానికే ఆటోలలో రూ.100 చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.దీంతో చాలా మంది బైక్‌లపై ప్రమాదకర రీతిలో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు.
ఒకరిద్దరు చిన్నపిల్లలు అయితే పర్వాలేదు.అయితే పెద్ద వారు కూడా పరిమితికి మించి బైక్‌పై వెళ్తున్నారు.

ఇదే కోవలో ఓ నలుగురు వ్యక్తుల కుటుంబం ఒకే బైక్‌పై ప్రయాణించింది.ఓ యువతి బైక్ వెనుక తల్లి ఒడిలో కూర్చుని ప్రయాణించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.భార్యాభర్తలు, వారి ఇద్దరు చిన్న పిల్లలతో బైక్‌పై వెళ్తే పర్వాలేదు.అయితే నలుగురు పెద్దలు కలిసి ఒకే బైక్‌పై వెళ్తే మాత్రం అది ప్రమాదానికి దారి తీస్తుందని భావించాలి.
ఓ కుటుంబం మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు.ఒకే బైక్‌పై నలుగురు ఎక్కి కూర్చున్నారు.
అందులోనూ వెనుక ఇద్దరు మహిళలు కూర్చున్నారు.అందులో ఓ మహిళ తల్లి కాగా, ఆమె ఒడిలో యువతి కూర్చుంది.
చిన్న పిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకుని పెద్దలు ప్రయాణిస్తుంటారు.

అయితే పెద్ద వయసు ఉన్నప్పటికీ ఆ యువతి తన తల్లి ఒడిలో కూర్చుని ప్రయాణించింది.స్పీడ్ బ్రేకర్లు, గుంతలు ఉన్న చోట ఏ మాత్రం పట్టుతప్పినా కింద పడిపోవడం ఖాయం.ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు.
పూర్నియా పరివార్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.ఏదేమైనా ఆ బైక్ డ్రైవింగ్ చేసే వ్యక్తికి అవార్డు ఇవ్వాలని నెటిజన్లు సరాదాగా కామెంట్లు పెడుతున్నారు.
దర్శకుడు త్రివిక్రమ్ ఓ సినిమా ఫంక్షన్‌లో చేసిన ‘అక్కడ స్పేస్ లేదు.క్రియేట్ చేసుకున్నారు’ వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు.







