Adipurush: ఆదిపురుష్ మూవీ లో పెద్ద మిస్టేక్ చేశా..అందుకే దేశం వదిలి పారిపోయా.. రచయిత కామెంట్స్ వైరల్..!!

రామాయణ ఇతిహాస గాధని మన ముందు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా అని ఆదిపురుష్ (Adipurush) అనే సినిమాని తెరకెక్కించారు దర్శకుడు ఓం రౌత్.కానీ ఈ సినిమా అనుకున్న విధంగా రాకపోవడంతో చాలామంది హిందువులు ఈ సినిమాపై డైరెక్టర్ పై నిర్మాత పై రచయితపై భగ్గుమన్నారు.

 Writer Manoj Muntashir Shocking Comments On Prabhas Adipurush Movie-TeluguStop.com

భారీ బడ్జెట్ పాన్ ఇండియా లెవెల్ లో వచ్చిన ఈ సినిమా అట్టర్ ప్లాఫ్ అయింది.దీంతో ప్రభాస్ (Prabhas) ఖాతాలో వరుసగా మూడో ప్లాఫ్ పడింది.

బాహుబలి 1, బాహుబలి 2 వంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత సాహో, రాధే శ్యాం, ఆది పురుష్ ఇలా వరుసగా మూడు అట్టర్ ప్లాఫ్ లు ఆయన ఖాతాలో పడ్డాయి.

అయితే ఈ సినిమా విడుదలైన సమయంలో రచయిత మనోజ్ ముంతషీర్(Manoj Muntashir) అలాగే డైరెక్టర్ ఓం రౌత్( Director Om Raut ) ఎన్నో ట్రోల్స్,వివాదాలను ఎదుర్కొన్నారు.

సినిమా హీరో హీరోయిన్, గ్రాఫిక్స్, డైలాగ్స్ ఇలా ప్రతి ఒక్క విషయంలో వివాదాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.ఇక ఈ సినిమా విడుదలైన సమయంలో సోషల్ మీడియా మొత్తం ఆది పురుష్ సినిమా గురించే టాక్ వినిపించింది.

ఈ సినిమా డైరెక్టర్ వందలాది కోట్లను ఖర్చు చేసి రామాయణ గాధని అవమానపరిచారు అని ఎంతోమంది ట్రోల్స్ చేశారు.అంతే కాదు ఈ సినిమాకు సంభాషణలు అందించిన మనోజ్ ముంతషీర్ మరింత ట్రోల్స్ కి గురయ్యాడు.

Telugu Aadipurush, Bahubali, Om Rout, Krithi Sanon, Manoj Munthasir, Prabhas, Ra

అంతేకాదు ఆ ట్రోల్స్ విషయంలో మనోజ్ స్పందించి మరింత వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు.అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మనోజ్ ముంతషీర్ మాట్లాడుతూ.నేను ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు సంభాషణలు అందించాను.కానీ ఎప్పుడు ఇలా జరగలేదు.ఇక నేను జీవితంలో చేసిన పెద్ద మిస్టేక్ ఆదిపురుష్ (Adipurush) సినిమాకి పనిచేయడమే.ఒక వ్యక్తి ఒకరోజు మంచి వాడిలా ఒక రోజు చెడ్డవాడిలా కనిపిస్తాడు.

కానీ ఆ వ్యక్తి కుటుంబానికి మాత్రం ఆయన ఎప్పటికీ హీరో గానే కనిపిస్తాడు.ఇక ఆదిపురుష్ సినిమా నాకు పెద్ద గుణపాఠం నేర్పించింది.

Telugu Aadipurush, Bahubali, Om Rout, Krithi Sanon, Manoj Munthasir, Prabhas, Ra

ఇక ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయిన సమయంలో చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నారు.కానీ ఆ ట్రోల్స్ కి నేను స్పందించకపోతే బాగుండేది.అలా స్పందించడం వల్ల చాలామంది నన్ను బెదిరించారు.ఇక నా మీద నెగిటివిటీ ఎక్కువవ్వడంతో కొన్ని రోజులు విదేశాలకు పారిపోయాను.నేను ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు పని చేశాను కానీ ప్రస్తుతం ఎవరైనా సినిమాకి ఛాన్స్ ఇస్తారా అని అడుగుతున్నాను అంటూ మనోజ్ ముంతషీర్ (Manoj Muntashir) రీసెంట్ గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube