సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో మంచి స్థాయిని అందుకోవాలని అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు…ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన యంగ్ యాక్టర్స్ అందరూ కూడా వరుసగా సినిమాలు చేస్తూ మంచి బిజీ గా ఉన్నారు.ఇక ప్రస్తుతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగీత్ శోభన్( Sangeet Shobhan ) మంచి సినిమాలు చేసుకుంటూ తనదైన రీతిలో ముందుకు దూసుకెళుతున్నాడు ఈ కుర్ర హీరో ఇప్పుడు అనుదీప్( Anudeep ) డైరెక్షన్ లో ఒక సినిమాలో హీరోగా నటించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఇక అనుదీప్ అంటే కామెడీకి పెద్ద పీట వేసారు.

కాబట్టి సంగీత్ శోభన్ అనుదీప్ డైరెక్షన్ లో నటించడం చాలా వరకు ప్లేస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇప్పటికే ఆయన మాడ్( mad ) అనే సినిమాలో మంచి పాత్రలో నటించి మెప్పించడమే కాకుండా తనదైన రీతిలో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా మీదనే ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు గా తెలుస్తుంది.
ఇక ఇదే క్రమం లో ఆయన మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకునే పనిలో పడ్డాడు.అందులో భాగంగానే చాలా కథలు వింటూ కూడా అవి చేయకుండా మంచి కథల కోసం ఆలోచిస్తూ నిదానంగా ముందుకు వెళుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే వాళ్ళ అన్నయ్య సంతోష్ శోభన్ చాలా సినిమాలు చేస్తూ ఉన్నప్పటికీ తను మాత్రం నిదానంగా వెళ్తేనే ఇక్కడ ఎక్కువ రోజులు కొనసాగుతామనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదే సమయంలో ఆయన కెరీర్ మీద మంచి ఫోకస్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక అనుదీప్ డైరెక్షన్ లో సినిమా అంటే సంగీత్ శోభన్ కి ఒక మంచి హిట్ పడటం ఖాయం అని తెలుస్తుంది ఇక ఈ సినిమా తో తను స్టార్ హీరో అవ్వాలని కోరుకున్నట్లు గా తెలుస్తుంది…
.







