తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకోవడానికి చాలా మంది చాలా రకాల సినిమాలు చేస్తూ ఉంటారు.ఇక అందులో భాగంగానే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన వెంకటేష్ కూడా తన కెరియర్ లో వరుసగా చాలా సినిమాలు చేస్తూ మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఇక ఆయన చేసిన సినిమాల్లో ఒక సినిమా చేసినందుకు మాత్రం తను ఇప్పటికీ రిగ్రేట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది.అది ఏ సినిమా అంటే మెహర్ రమేష్ డైరెక్షన్ లో చేసిన షాడో సినిమా( Shadow movie )ఆ సినిమా చేసి ఉండకపోతే బాగుండేది అని తనకు తాను రిగ్రేట్ అవుతున్నట్టు గా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే ఇంకోసారి అలాంటి సినిమాలు చేయకూడదని తనకు తాను తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది.ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇలాంటి సినిమా చేసే దాని కంటే ఖాళీగా కూర్చున్నది బెటర్ అని తన సన్నిహితుల దగ్గర వెంకటేష్ చెప్పినట్టు గా తెలుస్తుంది.అయితే అప్పటికే మెహర్ రమేష్ వరుసగా మూడు ప్లాప్ లు ఇచ్చినప్పటికీ వెంకటేష్ ఆయన మీద నమ్మకం ఉంచి సినిమా ఇస్తే ఆ సినిమా కూడా డిజాస్టర్ చేశాడు.దానితో దాదాపు 10 సంవత్సరాల వరకు మెహర్ రమేష్( Meher Ramesh ) కి ఎవరు సినిమాలు ఇవ్వలేదు.
ఇక రీసెంట్ గా భోళా శంకర్ సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికీ ఆ సినిమాతో కూడా చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ని ఇచ్చాడు…ఇక అందుకే ఇప్పుడు మెహర్ రమేష్ కి ఎవరు సినిమా కూడా ఇవ్వట్లేదు.వెంకటేష్ తన సినీ కెరియర్ లో చేసిన ఒకే ఒక తప్పు మెహర్ రమేష్ కి సినిమా ఇవ్వడం అని తన సన్నిహితుల దగ్గర షాడో సినిమా ప్లాప్ అయినప్పుడు చెప్పినట్టుగా అప్పట్లో వార్తలు హాల్చల్ చేశాయి…
.