తెలంగాణ బీజేపీ తాజాగా విడుదల చేసిన చివరి జాబితాలో మరోసారి మార్పులు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే బెల్లంపల్లి అభ్యర్థిని బీజేపీ మళ్లీ మార్చిందని తెలుస్తోంది.
చివరి జాబితాలో బెల్లంపల్లి నియోజకవర్గ టికెట్ ను కొయ్యాల ఎమాజీకి కేటాయించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న బీజేపీ పాత జాబితాలో ఉన్న విధంగానే శ్రీదేవికే కేటాయించింది బీజేపీ.
అలాగే అలంపూర్ టికెట్ మారెమ్మకు బదులు రాజగోపాల్ కు కేటాయించింది.మొత్తం 14 మందితో చివరి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మొత్తం 111 స్థానాల్లో పోటీ చేస్తుండగా మిగిలిని ఎనిమిది స్థానాలకు జనసేనకు కేటాయించిన సంగతి తెలిసిందే.







